
గత కొద్దిరోజులుగా కూటమి ప్రభుత్వం పైన పలు రకాల సంస్థలకు భూములు కేవలం 99 రూపాయలకే కేటాయించిందనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ ప్రశ్నలకు పదేపదే కూటమి ప్రభుత్వానికి కూడా ఎదురవుతున్నాయట. ఈ విషయంపైన వైసీపీ నేతలు, అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తూ ఉండడంతో మహానాడులో లోకేష్ స్పందించడం జరిగింది. ఉర్సా సంస్థకు 99 రూపాయలకి భూమి కేటాయించారు అనడం పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగానే ఉన్నారంటూ మహానాడులో నారా లోకేష్ సవాల్ విసిరారు.
టిసిఎస్ కు మాత్రమే కేవలం 90 పైసలకు ఎకరాచొప్పున భూములను కేటాయించామని..ఉర్సా కు మార్కెట్ ధర ప్రకారంగానే భూములను కేటాయించామంటూ నారా లోకేష్ మహానాడులో క్లారిటీ ఇచ్చారు. వీటి ద్వారా విశాఖపట్నంలో ఉండే నిరుద్యోగులకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని కేటాయించామని.. ఒకవేళ అభివృద్ధి అయితే విశాఖపట్నం నగరాన్ని అందుకోవడం చాలా కష్టమే అంటూ తెలియజేశారు నారా లోకేష్. అలాగే విశాఖపట్నం తో పాటుగా ఉత్తరాంధ్రవైపుగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కానీ బయటికి పోవడం ఉండదు అంటూ మహానాడులో తెలిపారు. మరి ఈ విషయం పైన వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ ఎలా కౌంటర్ వేస్తారో చూడాలి.