
కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం జగన్, భారతిలను టార్గెట్ చేస్తోందని వైఎస్ కుటుంబం జోలికి వస్తే ఊరుకోమని వాళ్లు చెబుతున్నారు. కూటమిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో కూటమి డైవర్షన్ పాలిటిక్స్ దిశగా అడుగులు వేస్తోందని వైసీపీ నేతలు ఫీలవుతున్నారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా జగన్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సైతం అరకచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఏడాదిగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని జగన్ అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, జర్నలిస్టులను భయ కంపితులను చేస్తున్నారని జగన్ వెల్లడించారు. తాను చేయని వ్యాఖ్యలకు కొమ్మినేనిని అరెస్ట్ చేసి కక్ష సాధింపులను పతాక స్థాయికి తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు.
సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేయించారని జగన్ చెప్పుకొచ్చారు. మీరు గతంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే మహిళలపై మీకు ఎంతటి గౌరవం ఉందో అర్థమవుతుందని జగన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తడం గమనార్హం. ఏపీ అరాచాకానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు