అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది స్పాట్ లోనే చనిపోయారు . ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు . దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వార్తల ద్వారా మనం తెలుసుకుంటూనే వస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మరణించడం పట్ల పలువురు నేతలు  సందేహం వ్యక్తం చేస్తున్నారు . దానికి కారణాలు లేకపోలేదు.  ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని ఈ  ప్రయాణానికి ముందు రెండు సార్లు లండన్ టికెట్స్ బుక్ చేసుకుని మరి రద్దు చేసుకున్నారు.

ఇదే ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ గా మారిపోయింది . లండన్ లో ఉన్న భార్య కుమార్తెను కలిసేందుకు మొదటగా మే 19వ తేదీ ఎయిర్ ఇండియా ద్వారానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత క్యాన్సిల్ చేసేసారు. జూన్ 25న తిరిగి రావాలి అని భావించారు విజయ్ రూపాని , అయితే ఆ ప్లాన్ లో మార్పుల వల్ల మే 19న లండన్ కు వెళ్ళవలసిన విమానం టికెట్లు రద్దు చేసుకొని సైలెంట్ అయిపోయారు. విజయ్ రూపాని ఆ తర్వాత జూన్ 5న ప్రయాణించాలి అని నిర్ణయించుకున్నారు . ఆ తేదీకి విమాన టికెట్ బుక్ చేసేసుకున్నారు . అయితే మళ్లీ తన ట్రావెల్ ప్లాన్ ని పర్సనల్ కారణంగా రెండోసారి రద్దు చేసుకున్నారు .

ఫైనల్లీ జూన్ 12న ప్రయాణించేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 లోని సీట్ నెంబర్ 2డి ని బుక్ చేసుకున్నారు.  అయితే ఈ ప్రమాదంలో ఆయన స్పాట్లోనే చనిపోయారు . ఎందుకు విజయ్ రూపాన్ని రెండుసార్లు టికెట్ బుక్ చేసుకుని వెనక్కి క్యాన్సిల్ చేశారు అని ఇప్పుడు జనాలు కొత్త రకమైన డౌట్ ను లేవదీశారు . అంతేకాదు విజయ్ రూపాని ని చంపడానికే టోటల్ విమానాన్ని క్రాష్ చేశారా అన్న అనుమానాలు కూడా జనాలలో ఉన్నాయి . విజయ రూపాని  ఫాన్స్ కూడా ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు . గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానికి ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతే శత్రువులు కూడా ఉన్నారు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు . ఆయనను చంపడానికే టోటల్ ఫ్లైట్ క్రాష్ చేశారా అన్న సందేహాలు ఉన్నాయి . అయితే అధికారులు మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు . కేవలం సాంకేతిక లోపం కారణంగానే ఈ ఫ్లైట్ క్ర్స్ష్ అయ్యింది అంటూ అధికారులు తేల్చేశారు . ఈ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో పాటు 33 మంది ఇతర వ్యక్తులు మొత్తం కలిపి 274 మంది మరణించారు . అదృష్టవశాత్తు బ్రిటన్ పౌరుడైన రమేష్ విశ్వాస్ అనే ఒక ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాదు..!


మరింత సమాచారం తెలుసుకోండి: