
పసుపు బోర్డు పేరుతో కేవలం బోర్డు మాత్రమే ఏర్పాటు చేశారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని నిలదీశారు. గోదావరి నీటిని తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హిమాలయ నదుల నుంచి నీటిని తెచ్చే ఆలోచనలు, నదుల అనుసంధానం పేరుతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణను వంచిస్తున్నాయని విమర్శించారు.రేవంత్ రెడ్డిని బీజేపీ రక్షణ కవచంలా కాపాడుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మోసం చేస్తూ, మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ అబద్ధాల జాతర నిర్వహించిందని, ఇప్పుడు రాష్ట్రంలో చెప్పుల జాతర కనిపిస్తోందని వ్యంగ్యంగా విమర్శించారు.రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, సీఎం సినిమా వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, ప్రజలు భయపడవద్దని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి హయాంలో అతిశయించిన అధికారుల పేర్లను రాసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి, గత 20 నెలల మోసాలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు