తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మునుగోడు శాసనసభ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డికి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పైన అసహనాన్ని తెలుపుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పైన వరుసగా పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదంగా మారుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కాగా ఇక్కడ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు కోమటిరెడ్డి.


కోమటిరెడ్డి తన అనుచరులతో గన్ పార్కు వద్ద అమరవీరులకు సైతం నివాళులు అర్పించి ఒక సంచలన ప్రకటన చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో కూడా తనకు అవకాశం ఇస్తానని ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదని, రింగ్ రోడ్డు విషయంలో కూడా పోరాటం చేస్తానని తెలియజేశారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇస్తే తనకి కూడా ఇస్తానంటూ ఇచ్చిన హామీ ఏమయిందా అంటూ పరోక్షంగానే సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా వినిపిస్తున్నాయి.



అలాగే వరదలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ తాను అసెంబ్లీకి  రావడం ఇష్టం లేదని తెలియజేశారు. కేవలం ఈరోజు మాత్రమే అసెంబ్లీలోకి వస్తానని రేపటి నుంచి వరద బాధితుల ప్రాంతాలలో తాను పర్యటిస్తానంటూ వెల్లడించారు కోమటిరెడ్డి. చివరిలో అసెంబ్లీకి తాను హాజరయ్యేది కూడా ఇదే చివరి రోజు అన్నట్లుగా హింట్ ఇచ్చారు. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒక్కటే కోమటిరెడ్డి దూరంగా ఉంటారా? లేకపోతే పూర్తిగానే దూరం అవుతా ఆనే విషయం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పోలిటిక్స్ లోనే సంచలనంగా మారుతున్నాయి. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందనే విషయంపై చాలామంది నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తున్నాయి. మరి కోమటిరెడ్డి వ్యాఖ్యల పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగిస్తారో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: