
Kwin లో 100 ఎకరాల లేదా ఏదైనా యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున ఒక్కో యూనివర్సిటీ, స్కూళ్లకు , 50 ఎకరాల స్థలాలను కేటాయించారు. 3,000 మంది స్టూడెంట్స్ ఉండేలా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. దేవానంద సాగర్ యూనివర్సిటీ, డాక్టర్ సికెఎం షైన్ స్కూల్ ఆఫ్ ఎథిక్స్ అండ్ టెక్నాలజీ కేకే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, కేఎల్ఈ యూనివర్సిటీ, ప్రగతి యూనివర్సిటీ, క్వాలిటీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ , ఆర్వి కాలేజ్, శారద యూనివర్సిటీ, ఇలాంటి విద్యాసంస్థలకు ముందుగా ఇక్కడ స్థలాలను ఇచ్చేశారు. ఈ విద్యాసంస్థల వారు అక్కడ ఒక్కొక్కరు మూడు వేల మంది విద్యార్థులకు పాఠాలు చెబుతామంటే స్థలాలను ఇచ్చేశారు.
వాస్తవానికి మొదట అక్కడ చెప్పింది వ్యాపార హబ్, ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి మరి చివరికి విద్యాసంస్థలకు ఇచ్చేశారు. వాటి ద్వారా వ్యాపారం పెరుగుతుందనే ఆలోచనతో అక్కడ ప్రభుత్వం ఉన్నది. విద్యాసంస్థలు భూమిని తీసుకుంటే అక్కడ విద్యార్థులకు స్కూల్ ,కాలేజీ హాస్టల్స్ వంటివి కట్టడంతో.. ఆ ప్రాంతమంతా కూడా ఆటోమేటిగ్గా ఒక నగరంగా మారుతుందని.. తద్వారా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు దగ్గరలో ఉండడానికి కూడా ఇష్టపడతారని.. దీని ద్వారా అపార్ట్మెంట్లు, విల్లాస్ వంటివి కూడా వచ్చేస్తాయని ఆ వెంటనే వ్యాపారాలు కూడా వస్తాయనే విధంగా కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా అక్కడ ఒక మహానగరంగా ఏర్పడుతుందని భావనతో ఉన్నారు.