
యనమల మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 188 మరియు 190 (4) గురించి చదువుకుంటే, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన నిబంధనలు జగన్‌కు స్పష్టంగా అర్థమవుతాయని చెప్పారు. ఈ నిబంధనలను అర్థం చేసుకోకుంటే, న్యాయవాదుల సలహా తీసుకోవాలని సూచించారు.
ఆర్టికల్ 190 (4) ప్రకారం, ఒక శాసనసభ సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభ సమావేశాలకు అనుమతి లేకుండా హాజరు కాకపోతే, ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయడానికి సభకు అధికారం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదని, రాజ్యాంగంలోని ఈ నిబంధనలను ఉల్లంఘించారని యనమల ఆరోపించారు.
అంతేకాకుండా, ఒకసారి అనర్హత వేటు పడిన తర్వాత, తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అనే విషయం కోర్టు నిర్ణయించాల్సి ఉంటుందని యనమల అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కోర్టులో తేలాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కామెంట్ల గురించి జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జగన్ రాకపోయినా ఎమ్మెల్యేలను అయినా పంపాలంటూ మాజీ మంత్రి అనిత కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు