
ఇటీవల కాలంలో హైదరాబాదులో రోడ్ల పరిస్థితుల వల్ల అక్కడ కంపెనీలను పెట్టలేమని చెప్పిన వారిని లోకేష్ ఏపీకి ఆహ్వానించారు. అలా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్స్ MSML కంపెనీలను పిలిస్తే రావడానికి సిద్ధంగానే ఉన్నారు. ఏపీలో చాలా చోట్ల భూములు ఉన్నాయి. కృష్ణ ,గుంటూరు, జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. అమరావతి ,విజయవాడ, గుంటూరు, తెనాలి ,మంగళగిరి వంటి ప్రాంతాలలో కలిపినటువంటి వాటన్నిటినీ కూడా రాజధానిగా ప్రకటిస్తే.. వీటివల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఆ ప్రాంతలు మొత్తం కూడా రాజధానిగా మారిపోతాయి.
ఈ ప్రాంతంలో ఎక్కడ పరిశ్రమలు పెట్టుకున్న సరే రాజధానిలో పెట్టుకున్నట్టే అని చెబితే కచ్చితంగా బడా కంపెనీలు సైతం ఏపీకి తరలి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వారికి ప్రోత్సాహాలు, లోన్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తే చాలు చాలు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. కూటమిలో భాగంగా బిజెపి ఉన్నది, ఈ కంపెనీలకు సంబంధించి లోన్ల విషయంలో మాట్లాడి వారికి కావలసిన సదుపాయాలను ఏపీ ప్రభుత్వం కల్పిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. మరి ఇలా వచ్చిన అవకాశాన్ని సీఎం చంద్రబాబు ఉపయోగించుకుంటారు లేదొ చూడాలి మరి.