
ఈ నేపథ్యంలో, “ఆనంద్” అనే ట్విట్టర్ అకౌంట్ నుండి సెప్టెంబర్ 13న చేయబడిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఈ ట్వీట్ బిగ్ సెన్సేషన్ గా మారింది. ట్వీట్‌లో, ఈ ఘటన ముందే జరుగుతుందని తెలిపారు. ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.." తమిళనాట భారీ తొక్కిసలాట జరగబోతుంది. 50 మంది యువత బలైపోయే దారుణం జరగబోతుంది. డిఎంకే కంటే 10 రెట్లు విషపూరితమైన విజయ్ వల్లే ఇది జరగబోతుంది"అంటూ పోస్ట్ చేశారు. పోలీసులు ప్రస్తుతం ఈ ట్వీట్ నిజంగా ఆధారాలతో చేశారా..? లేక సాధారణంగా చేసారా..? ఈ దుర్ఘటన ముందే జరగబోతోందని తెలుసుకుని చేయబడిందా అనే విషయంపై విచారణ చేస్తున్నారు.
ఇదే తమిళనాట ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్. “ఆనంద్ ఎందుకు ముందే ఇలా ట్వీట్ చేశాడు..? ఆయనకి ఇది ఎలా తెలుసు?” అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ర్యాలీ సమయంలో విజయ్ ఆలస్యంగా రావడంతో, జనసంద్రోహం పెరిగి ఇంతటి దారుణమైన ఘటనకు దారితీసిందని వారు అంటున్నారు. ఈ సంఘటనతో సంబంధిత విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రజలు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా విజయ్ ఆలస్యంగా రాకపోవడం అని అభిప్రాయపడుతున్నారు. చెప్పిన సమయానికంటే ఏడు గంటలు ఆలస్యంగా రావడం వల్లే జనాలు తాకిడి పెరిగి ఇలాంటి పరిస్ధితి వచ్చింది అని మండిపడుతున్నారు..!