తమిళ నటుడు విజయ్ కి ఒక్కసారిగా భారీ షాక్ తగిలింది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ఈయన రాజకీయ పార్టీ పెట్టడమే ప్రజల్లోకి దూసుకెళ్లారు. ఈయన ఫాలోయింగ్ దృష్ట్యా ఎంతో మందిని ఆకర్షించారు.ఏ చిన్న సభ పెట్టినా వేలు, లక్షల్లో ప్రజలు తరలి రావడంతో రాజకీయాల్లో ఈయనకు తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఇక విజయ్ కి రాజకీయాల్లో ఎదురెవరు ఉండరు.రెండు అధికార పార్టీలను తొక్కుకుంటూ వెళ్తాడని చాలామంది మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చిన సెలబ్రిటీలలో జయలలిత,సీనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇలాంటి ఫాలోయింగే ఉండేది.ఆ ఫాలోయింగ్ మళ్లీ విజయ్ తలపతి రాజకీయ పార్టీ పెట్టిన సమయంలో కనిపించడంతో చాలామంది ఈయన తమిళనాడు రాజకీయాలను శాసించే స్టేజికి వెళ్తారని ఊహించారు.

 కానీ కరూర్ లో జరిగిన ఈ దుర్ఘటన ఒక్కసారిగా ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంకెళ్లు వేసింది. కరూర్ లో జరిగిన ఈ దుర్ఘటనని రెండు అధికార పార్టీలు ప్లస్ చేసుకోవాలని చూస్తున్నాయి. అటు కేంద్రంలో ఉన్న బిజెపి ఇటు రాష్ట్రంలో ఉన్న డీఎంకే రెండు ప్లస్ చేసుకొని తమ ప్రచారంలో దీన్నే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే విజయ్ బాదిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించినప్పటికీ అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ విజయ్ ని పొలిటికల్గా దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో చాలామంది అధికారంలో ఉన్నవాళ్లు ఇతర ప్రతిపక్ష నేతలను ఏదో ఒక విధంగా వాళ్ళు గతంలో చేసిన తప్పులను బయటకు తీస్తూ కేసులు కోర్టులు అంటూ తిప్పాలని చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే విజయ్ ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటన ఆయన పొలిటికల్ కెరీర్ కి మైనస్ అవుతుందా అని మాట్లాడుకుంటున్నారు..

 రాజకీయాల్లో పగ ప్రతీకారాలు ఎక్కువగా ఉంటాయి. వారికి నచ్చని రాజకీయ నాయకులపై ఏదో ఒక విధంగా కేసులపేరుతో జైల్లో తోసించేయాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో విజయ్ చేసిన తప్పు కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారిపోయింది.ఇప్పటికే విజయ్ ఇప్పటినుండి తమిళనాడులో ఎక్కడ కూడా బహిరంగ సభ,ర్యాలీలు చేయకూడదు అని పలువురు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు కరూర్ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించి విజయ్ ఇప్పటినుండి ఎలాంటి ర్యాలీలు చేయకూడదు అని తెలిపారు. ఒకవేళ కోర్టు వీరు దాఖలు చేసిన పిటిషన్ ని విచారించి విజయ్ ఇకపై ర్యాలీలు బహిరంగ సభలు పెట్టకూడదని ఆదేశిస్తే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు కు చాలా పెద్ద సంకెళ్ళు వేసినట్టే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.తమిళనాడు రాజకీయాల్లో తిరుగు ఉండదు అనుకున్న విజయ్ కి ఎంట్రీలోనే పెద్ద చీక్కచ్చి పడింది.మరి చూడాలి ముందు ముందు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: