ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి. ఇందులో ఎలాగైనా పట్టు సాధించాలని బీఆర్ఎస్, హైదరాబాదులో తమ సత్తా చాటాలని కాంగ్రెస్, బిజెపి గెలిచి వారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. వీటన్నింటికీ ఎంఐఎం పార్టీ నే కీలకంగా మారనుంది. అలాంటి ఈ తరుణంలో ఇప్పటికే  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి డోర్ టు డోర్ తిరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ  ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని కసరత్తులు చేస్తోంది. ఇదే సమయంలో  కాంగ్రెస్ నుంచి కొంతమంది వ్యక్తులు టికెట్ కోసం  ఆశిస్తున్నారు. మరి వారు ఎవరు.. వారిలో కీలకమైన వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకుందాం..

 ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించక పోయినా డివిజన్ల వారీగా నేతలను దింపి ప్రచారం నిర్వహిస్తోంది. ఎక్కడికి అక్కడ కమిటీలు కూడా వేసింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి పెద్దగా పట్టులేదు. కంటోన్మెంట్ ఉపఎన్నికతో కాస్త పట్టు సాధించింది. ఈ ఎన్నికతో ఎలాగైనా విజయం సాధించి హైదరాబాదులో పుంజుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ కోసం రహమత్నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన సీఎన్ రెడ్డి ఈమధ్యనే కాంగ్రెస్ లో చేరారు. అలాగే బీసీ నినాదంతో అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ వీరిద్దరినీ కాదని మరో ఇద్దరినీ మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇందులో ముఖ్యంగా నవీన్ కుమార్ యాదవ్,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లున్నట్టు తెలుస్తోంది. అయితే నవీన్ కుమార్ యాదవ్ గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి దాదాపుగా 50,000 కి పైగా ఓట్లు సాధించారు. మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి  ఆ నియోజకవర్గంలో నుండి మంచి పేరు సాధించుకున్నారు. అలాగే బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మొదటి మేయర్ గా కూడా పనిచేశారు. ఈ ఇద్దరూ జూబ్లీహిల్స్ లో పేరు ఉన్న నేతలే.. వీరిలో కాంగ్రెస్ ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: