
టాలీవుడ్ నుంచి చిరంజీవి ,వెంకటేష్ వికే.నరేష్, రమ్యకృష్ణ ,జయసుధ, నాగార్జున ,జగపతిబాబు మరికొంతమంది హీరోలు హీరోయిన్స్ పాల్గొన్నారు. ఈ రీయూనియన్ ని ఉద్దేశిస్తూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఇక్కడికి బాలయ్య రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం పైన కొంతమంది నేటిజన్స్ బాలయ్య మళ్ళీ మిస్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ రీయూనియన్ కి బాలకృష్ణ ఎందుకు పాల్గొనడం లేదు? ఎందుకు దూరంగా ఉంటున్నారని విషయంపై అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ఈ విషయంపై తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలుపుతున్నారు నేటిజన్స్. ముఖ్యంగా బాలకృష్ణ స్ట్రైట్ ఫార్వర్డ్ అని మనసులో ఏది దాచుకోరని.. ఇలాంటి పార్టీలకు వెళితే దీనివల్ల అక్కడికి వచ్చిన సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ఇన్వైట్ చేయలేదేమో అని, మరి కొంతమంది బాలకృష్ణ అలాంటి చోటికి వెళ్లరు అంటూ కామెంట్ చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఇన్వైట్ చేయకపోవడం వల్లే రాలేదని, బాలయ్యకు, చిరంజీవికి ఇలాంటి విషయాలలో పడదు అందుకే బాలయ్య అని దూరం పెట్టేస్తూ ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటు మెగా, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఒక రచ్చ జరుగుతోంది.
కానీ ఒకానొక సందర్భంలో బాలయ్య ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాల పైన స్పందించారు.. తనకు రెస్పెక్ట్ ఇస్తే ఇతరులకు కూడా తాను అదే ఇస్తానని తనని ఎవరు గౌరవించకపోతే తాను కూడా పట్టించుకోనంటూ తెలియజేశారు. 2019లో కూడా 80 స్టార్స్ రియూనియన్ అంటూ ఒక పార్టీ జరిగిన ఆ పార్టీకి బాలయ్యకు ఆహ్వానం అందలేదట.. ఈ పార్టీకి చిరంజీవి ఇన్వైట్ చేయలేదనే విషయంపై బాలకృష్ణ అని ప్రశ్నించగా.. తనని ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదని వెల్లడించారట బాలయ్య. అంతేకాకుండా తాను సుమలత, అంబరీష్, మోహన్ లాల్ వంటి సెలబ్రిటీల పార్టీకి రెగ్యులర్గా వెళ్తానని తెలియజేశారు. ఏ పార్టీకైనా సరే తనను పిలిస్తేనే వెళ్తానని తెలియజేశారు. అప్పట్లో బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించాయి.