
బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్విని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య ఈ మధ్య కాలంలో వరుస విజయాలు సాధించడంలో తేజస్విని పాత్ర ఎంతో ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అఖండ2 సినిమాకు సైతం నందమూరి తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తేజస్విని నటన వైపు అడుగులు వేయబోతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రముఖ జ్యువెలరీ సంస్థకు తేజస్విని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్నాయని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్త నిజమైతే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. తేజస్విని యాక్టింగ్ స్కిల్స్ ను బుల్లితెరపై చూడాలని అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు 2026 సంవత్సరంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఘాటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో బాలకృష్ణ ఏం చేయబోతున్నారనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. బాలయ్య అఖండ2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా డిసెంబర్ నెల 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా సక్సెస్ సాధించడం నందమూరి తేజస్వినికి కూడా కీలకమని చెప్పవచ్చు. నందమూరి తేజస్విని భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. తేజస్విని యాడ్ కు మంచి రెస్పాన్స్ వస్తే ఆమె మరిన్ని యాడ్స్ లో నటించే ఛాన్స్ అయితే ఉంది.