నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీరోల్స్ కూడా పోషించారు. అయితే అలాంటి శ్రీకాంత్ అయ్యంగార్ అచ్చం రాంగోపాల్ వర్మ లాగే ప్రవర్తిస్తారు. చాలామంది ఈయన ప్రవర్తన మాటలు చూసి ఆర్జీవి 2 అని కూడా పిలుస్తారు.అయితే అలాంటి నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా మహాత్మా గాంధీ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈయన చేసిన ఈ అసభ్యకర కామెంట్లపై చాలామంది మహాత్మా గాంధీ అభిమానులు మండి పడుతున్నారు. మరి ఇంతకీ శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు దేశవ్యాప్తంగా మందు అమ్మరు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆ రోజు ఈయన ఓ వీడియో రిలీజ్ చేసి బట్ట తల వేసుకొని నోటు మీద ఉంటాడు చూడు.. 

ఆ దరిద్రుడి బర్త్డే అని ఈరోజు మందు అమ్మడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మహాత్మా గాంధీ పై గాంధీ జయంతి రోజే కాదు ఆ తర్వాత షేర్ చేసిన తాజా వీడియో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఆ వీడియోలో ఏముంది అంటే.. నేను ఏ పోస్ట్ పెట్టిన కామెంట్లు వస్తున్నాయి. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ నేను అక్టోబర్ 2 రోజు ఓ పోస్ట్ పెడితే దానిపై చాలామంది మండిపడ్డారు. కానీ నీకేం తెలుసురా వాడి గురించి..ఒక 16, 15 ఏళ్ల అమ్మాయిని నగ్నంగా పడుకోబెట్టి పక్కన పడుకొని నిగ్రహంగా ఉన్నాడో లేదో చూసుకున్నాడు.ఇలాంటి వాడిని మహాత్ముడు అంటారా.. ఎంతోమంది అమ్మాయిలని లైంగికంగా వేధించాడు.. 

వాడు మహాత్ముడా..స్వాతంత్రం వాడి తెచ్చాడా బొక్కా.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి లక్షలాది మంది కలిసి తెచ్చారు వాళ్లంతా పరమాత్ములు.. వీడు జాతిపితనా అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈయన మాట్లాడిన ఈ వీడియో నెట్టింట దుమారం సృష్టిస్తోంది.. అంతేకాదు చాలామంది మహాత్మా గాంధీ అభిమానులు కూడా ఈయనపై మండి పడుతున్నారు.జాతిపితను పట్టుకొని అలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. మహాత్మా గాంధీ పై చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని వెంటనే శ్రీకాంత్ అయ్యంగార్ ని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.మరి దీనిపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: