
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉమ్మడి విశాఖ జిల్లాలో అపూర్వమైన స్పందనను అందుకుంది. ఇటీవల నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన కోసం వచ్చిన జగన్ గారికి ప్రజలు ఊహించని స్థాయిలో నీరాజనం పట్టారు. ఈ పర్యటనకు లభించిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా? అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు దాదాపు 60 కిలోమీటర్ల దూరం కాగా, ఆ దూరాన్ని అధిగమించడానికి జగన్ గారికి ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందని సమాచారం. మార్గం పొడవునా లక్షలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలు ఆయన్ను చూసేందుకు, తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఎగబడ్డారు.
ఈ పర్యటనలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సహా పలువురు ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మాజీ సీఎంను కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న జగన్, తప్పకుండా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పర్యటన విజయవంతం కావడం వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని, జోష్‌ను నింపిందనే సంగతి స్పష్టమవుతోంది. ఈ పర్యటన ద్వారా ప్రజల్లో వైఎస్సార్‌సీపీ పట్ల ఇంకా చెక్కుచెదరని అభిమానం ఉందని, జగన్ పట్ల వారి విశ్వాసం సజీవంగా ఉందని మరోసారి రుజువైంది. ప్రజలు, కార్యకర్తల ఈ అపూర్వ స్పందన రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీకి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్ మరిన్ని ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి చేస్తున్న తప్పులే వైసీపీకి ప్లస్ కానున్నాయని తెలుస్తోంది.