కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి 2022 లో అతి చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్ర కాంతార. హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఇటీవల కాంతార చాప్టర్ 1 తో మరొకసారి బాక్సాఫీస్ వద్ద మరో ప్రభంజనం సృష్టిస్తున్నారు. విడుదలైన మొదటి షో నుంచి ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ 457 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు వినిపిస్తోంది.


ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో  కాంతార చాప్టర్ 1 సంచలనం  సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషలలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని,క్రిటిక్స్ చేత కూడా ప్రశంసలు పొందుతోంది. అయితే కాంతార, కాంతార చాప్టర్ 1 సినిమాలో హీరో  రిషబ్ శెట్టి దైవం ఆవహించినప్పుడు WHACOW అనే శబ్దం చేస్తారు. అయితే ఈ శబ్దానికి గల కారణం ఉన్నదట. ఈ శబ్దాన్ని భూతకొల ఆచారంలో అత్యంత పవిత్రమైన దైవ మాటగా అక్కడ ప్రజలు పరిగణిస్తారు. పంజుర్లి దైవం  ఆవహించి స్వయంగా పలికే పవిత్రమైన పదంగా అక్కడి ప్రజలు WHACOW మాటను దైవానుగ్రహంగా పరిగణిస్తారు.


అలాగే కాంతార అంటే ఒక రహస్యపు అడవి అని అర్థము. కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ , జయరామ్, గుల్షన్ దేవయ్య తదితర నటి, నటులు కీలకమైన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలోని ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉండడంతో చాలామంది సెలబ్రిటీలే ప్రశంసించారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం కూడా చాలానే కష్టపడినట్లు అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజుల్లో కాంతార చాప్టర్2 సినిమాని కూడా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: