జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన చేసినన్ని రోజులు పేద ప్రజల కోసమే ఆలోచించారు. అయితే ఆయన చేసిన అభివృద్ధి పనులు అప్పటికప్పుడు పెద్దగా రిజల్ట్ ఇవ్వకపోయినా భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడతాయి అనేది నిరూపించారు. అలా జగన్ విద్యా, వైద్య విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. అలాంటి జగన్ 2024 ఎలక్షన్స్ లో టిడిపి కూటమి చేతుల్లో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఎప్పుడైతే టిడిపి కూటమి ఏర్పడి గెలిచిందో అప్పటినుంచి పాలన అనేది  కాస్త ఆస్తవ్యస్తంగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా టిడిపి ఒక వర్గం, బిజెపి మరో వర్గం, జనసేన ఇంకో వర్గం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అలాంటి ఈ సమయంలో చాలామంది ప్రజలు జగన్ ఉన్నప్పుడే బాగుండే అనే ఆలోచనలో పడుతున్నారు. జగన్ కి మీడియా సపోర్ట్ ఎక్కడా లేకపోయినా తను చేసే కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు.

 అలాంటి ఈ తరుణంలో తాజాగా ఒక మీడియా సంస్థ జగన్ చేసిన మంచి పనులను బయటకు తీసుకు వచ్చింది. ఇన్నాళ్లు ఆయనకు వ్యతిరేకంగా చేసిన ఆ సంస్థ నిజాన్ని దాయడం అంటే కష్టం అన్నట్టుగా  జగన్ చేసిన అభివృద్ధిని ఉన్నది ఉన్నట్టుగా రాసింది. రిషికొండ దగ్గర జగన్ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారంటూ అప్పట్లో వార్తలు రాసుకోచ్చారు. జగన్ ఏదో అక్రమాలు చేసినట్టు చూపించారు. కానీ రిషికొండ దగ్గర ఆ బిల్డింగులు కట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే ఒక రాజభవనంలా కనిపిస్తున్నాయి. దీన్ని టిడిపి వారు జగన్ తన భార్య కోసం కట్టుకున్నారని తప్పుడు ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఆ భవనాల్లో జగన్ భార్య ఉంటుందా.. ఉండడం లేదు కదా.. చాలామంది ప్రజలు ఆ బిల్డింగ్ ను చూసి జగన్ చాలా అద్భుతంగా కట్టారు దీన్ని ప్రభుత్వ భవనాలకు వాడుకోవచ్చు కదా అని ఆలోచన చేస్తున్నారు. కానీ టిడిపి వాళ్లు జగన్ కు క్రెడిట్ వెళ్లిపోతుందని అలాగే ఖాళీగా ఉంచుతున్నారు..

ఈ విధంగా జనాల అభిప్రాయాలను బట్టి తాజాగా ఈనాడు కూడా కళ్ళు చెదిరేలా బిల్డింగులు ఉన్నాయని రాసుకోవచ్చు. కట్ చేస్తే జగన్ పూర్తిగా బెల్ట్ షాపులను నివారించారు. చంద్రబాబు హయాంలో మళ్లీ బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. దీనిపై తాగుబోతులు పెద్దగా వ్యతిరేకించకపోయినా మహిళలంతా వ్యతిరేకిస్తున్నారు. ఇంకొకటి మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు జగన్. కానీ దీనిపై టిడిపి ప్రభుత్వం పిపిపి విధానంలో  మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నామని చెబుతోంది.. ఇలా ఈ మూడు పనుల్లో జగన్ అద్భుతాలు సృష్టించారని, టిడిపి సర్కార్ ఎంత దాచిపెట్టిన ఇందులో ప్రజలకు మేలు జరిగే పనులే ఉన్నాయని అంటున్నారు. అప్పట్లో జగన్ చేసిందే కరెక్ట్ అని కితాబు ఇస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: