కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. అలాగే ఓట్ల లెక్కింపును నవంబర్ 14న నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీహార్‌లో అధికార పార్టి..ప్రతిపక్ష పార్టి అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నితిశ్ కుమార్ దగ్గర నుండి టిక్కెట్లు ఆశించిన పలువురు నేతలు నిరాశ చెందారు. టిక్కెట్ దక్కకపోవడంతో వారు పాట్నాలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికార నివాసం ఎదుట పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.


మనందరికీ తెలిసిందే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈసారి ఎలాగైనా ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు “ఇండియా” కూటమి కూడా ప్రతిపక్ష బలగాలను ఏకం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ట్విస్ట్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం ఆయన రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన పోటీ చేయబోమని ప్రకటించడం బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపుగా మారింది.



ఇక సీఎం నితీష్ కుమార్ ఈసారి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఆయనను నమ్మి, ఆయనతో కట్టుబడి పనిచేసిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకుండా, ఇతరులకు అవకాశం ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులే ఇప్పుడు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. వారు నితీష్ కుమార్ నివాసం ఎదుటే కూర్చొని “డౌన్ డౌన్ నితీష్ కుమార్” అంటూ నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు.



అయితే, నేతలు బయట నుంచే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, నితీష్ కుమార్‌ను నిలదీస్తున్నారు. ఇంతకాలం ఆయనకు అండగా ఉన్న నేతలే ఇప్పుడు తిరగబడడంతో, బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి.ప్రస్తుతం నితీష్ కుమార్‌పై నెగిటివ్ వాతావరణం ఏర్పడిందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పేరు హాట్ టాపిక్‌గా మారింది. కొందరు “ఇన్నాళ్లు అన్న అన్న అని పిలిచినవాళ్లే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: