ప్రస్తుత అమెరికా ప్రధాని అయినటువంటి ట్రంప్ పై పెద్ద ఎత్తున అమెరికన్లు తిరుగు బాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితమే అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ట్రంప్ భారీ మెజారిటీతో గెలిచి అమెరికా ప్రధాన మంత్రి గా నియమితులయ్యాడు. అమెరికా ప్రధాన మంత్రి గా ఎన్నిక అయిన తర్వాత ట్రంప్ పై ఆ దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తాడు అని , దేశాన్ని మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్తాడు అని ఆయనపై గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు. ట్రంప్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం గడవక ముందే అనేక రకాలైన పద్ధతులను అవలంబించాడు.

దానితో ఆ దేశానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈయన అధికారం లోకి వచ్చిన తర్వాత అనేక దేశాలపై టారిఫ్ లను అధికంగా పెంచాడు. ఇలా టారీఫ్ లను ట్రంప్ అధికంగా పెంచిన దేశాలలో చైనా , భారత్ ముందు స్థానాలలో ఉన్నాయి. అమెరికా ప్రజలు ఎక్కువ శాతం చైనా , భారత్ కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉండేవారు. ఇక ఆ వస్తువులపై పెద్ద ఎత్తున టారీఫ్ లను విధించడంతో అమెరికా ప్రజలకు చైనా , భారత్ వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత భారంగా మారింది. గతంతో పోలిస్తే ఈ రెండు దేశాల వస్తువులు భారీ ధరకు దక్కుతూ ఉండడం వల్ల అమెరికా ప్రజలు కూడా ట్రంప్ విధానాలపై వ్యతిరేకతను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

దానితో పెద్ద ఎత్తున అమెరికాలోని అనేక రాష్ట్రాలలో ట్రంప్ పై వ్యతిరేక నినాదాలు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ట్రంప్ పై ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తున్న కారణంగా ఆయన టారీఫ్ ల విషయంలో ఏమైనా వెనక్కు తాగుతాడా ..? లేక అదే విధంగా ముందుకు సాగుతాడా అనేది చూడాలి. ఏదేమైనా కూడా ప్రస్తుతం అమెరికా ప్రజలు మాత్రం ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: