జడేజా ఇన్స్టాగ్రామ్ మాయం కావడానికి ఐపీఎల్ ట్రెండీగా వినిపిస్తున్న ఈ వార్తలకు మధ్య ఏదైనా బలమైన సంకేతం ఉందా అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఐదుసార్లు చాంపియన్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజు శాంసన్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపించాయి. ధోని తర్వాత జుట్టుకు దీర్ఘకాలికంగా వికెట్ కీపర్, క్యాప్టెన్సీ కావాలని సీఎస్కే భావిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ను ఇవ్వాలి అంటే అందుకు ప్రతిగా చెన్నై టీమ్ లో ఉన్న రవీంద్ర జడేజా తో పాటు మరొక ప్లేయర్ (సామ్ కరన్ లేదా పతిరణ) ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు వినిపిస్తున్నాయి.
దీంతో జడేజా ను ఒప్పించడానికి సీఎస్కే టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే విధంగా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒకవేళ జడేజా అన్నిటికీ అంగీకారం తెలిపిన తర్వాతే తుది దశకు చేరుకుంటాయని నివేదికలు పేర్కొంటున్నాయి. రవీంద్ర జడేజా చెన్నై టీమ్ కి 2012 నుంచి అందుకున్న విజయాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు జడేజా. 2023 ఫైనల్ చివరిలో కూడా రెండు బంతులలో విజయాన్ని అందించిన ఆటగాడిగా పేరు సంపాదించారు జడేజా. ఆ సమయంలో ధోని కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. మరి ఇందుకు సంబంధించి నిజమా కాదా అనే విషయం నవంబర్ 15వ తేదీన తెలియబోతున్నట్లు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి