ముఖ్యంగా కారు పుల్వామాకు చెందిన డా.ఉమర్ దిగా గుర్తించారు. నిన్న కారులో కూడా ఉన్నది ఈ డాక్టరే నట. శ్రీనగర్లోని ఎండి మెడిసిన్ కాలేజీలో పనిచేస్తున్నారు. గత నెలలో అమీర్ పేరు మీద ఉన్న ఈ వాహనాన్ని డా. ఉమర్ కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు ఇదే వాహనంతో పేలుడు కోసం ఉపయోగించినట్లుగా తెలిపారు. ఢిల్లీ కారు పేలుళ్లలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఉండే ముగ్గురు అనుమానితులని సైతం అరెస్టు చేశారు. అందులో ఒకరు అమీర్ రషీద్ మీర్ (27), తారీక్ మాలిక్ (44), ఉమర్ రసీద్ మీర్ (30) జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు.
వీరితోపాటుగా మరో 13 మంది అనుమానితులను ఢిల్లీ పోలీసులు అదుపులకు తీసుకున్నట్లు వినిపిస్తున్నాయి. బాంబు బ్లాస్ట్ జరిగిన స్థలాన్ని FSL అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బ్లాస్ట్ అయిన దగ్గర నిందితుడు డిఎన్ఏ నమూనాలను కూడా సేకరిస్తున్నారట. అలాగే కారు ఏఏ పరిసర ప్రాంతాలలో తిరిగిందనే విషయాల పైన సిసిటీవీ ఫుటేజ్ లను కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఫరీదాబాదులో ఇద్దరు డాక్టర్ల దగ్గర 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పేలుళ్లలో యూపీ మహిళ డా. షాహిన్ అరెస్టు చేసిన ఫోటో కూడా బయటికి వచ్చింది దీంతో అధికారులు ఇమేను విచారిస్తున్న సమయంలో పలు విషయాలు బయటకు వస్తున్నట్లు సమాచారం.. ముఖ్యంగా ఆల్ ఫలహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఈమె ఉగ్రవాదులకు సంబంధించి నిధులు సమకూర్చడం, ఆపరేషన్ సులభతరంగా చేయడంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీలో జరిగిన పేలుళ్లపైన భారత ప్రధాన మంత్రి మోడీ కూడా మాట్లాడుతూ ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి సూత్రధారులు, పాత్రధారులను వదిలిపెట్టను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి