ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎర్రకోట దగ్గర పేలుడు చోటు చేసుకున్న కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి.
జమ్మూ కశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటి దగ్గర గురువారం రోజున అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అధికారులు పేలుడు పదార్థాలు ఉపయోగించి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారని తెలుస్తోంది. ఉమర్ నబీ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.
కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలు ఇంటిని కూల్చివేసినట్టు తెలుస్తోంది. ఉమర్ నబీ ఇల్లు ఉగ్రవాద కార్యకలాపాలకు చిరునామాగా మారడంతో ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఉమర్ నబీ కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుతున్నాడనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఉగ్రవాదులు ఆశ్రయం కోసం, ఆయుధాల కోసం అతడి ఇంటిని ఉపయోగించారనే ప్రచారం సైతం సాగింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇంటిని పేల్చివేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా భద్రతా దళాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయని చెప్పవచ్చు. ఈ ఘటన తర్వాత పుల్వామా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలను ముమ్మరం చేయడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి