బిజెపి మోదీ ప్రభుత్వం ప్రతి ఎన్నికలలో గెలుస్తూ దూసుకుపోతోంది. కొన్ని రాష్ట్రాలలో మిత్రపక్షాలతో కలిసి ప్రధాన మోదీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాలలో కూడా అధికారంలోకి భారీ విజయాలతో వస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఢిల్లీ ఎన్నికలలో కూడా గెలిచి మరొకసారి తమ బలాన్ని నిరూపించుకుంది బిజెపి. ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికలలో కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2023 జూలై 18న ప్రధాన మంత్రి మోదీ కూటమి పార్టీల సమావేశంలో ఒక కీలకమైన ప్రకటన చేసినట్లు వినిపిస్తున్నాయి.


ఎన్నికలలో కచ్చితంగా మనం 50% వరకు ఓటింగ్ సాధించాలని సూచించారు. అలా ఎన్డీఏ కూటమి బీహార్ లో కూడా 50% దాటింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్డీఏ 49.75% వరకు ఓటింగ్ శాతం అలాగే ఢిల్లీలో 47.15%, చతిస్గడ్ 46.27%, మధ్యప్రదేశ్ 48.62%, రాజస్థాన్ 41.70% ఓటింగ్ షేర్ని సాధించింది. బీహార్లో జైత్రయాత్రను కొనసాగించిన ఎన్డీఏ కూటమి ఇకమీదట మిగతా రాష్ట్రాలలో కూడా ఇదే కొనసాగించాలని ప్లాన్ చేస్తాంది. త్వరలో జరగబోతున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా తమ మార్కును చేర్చడం పైన ఫోకస్ చేశారు నరేంద్ర మోదీ.


నిన్నటి రోజున బీహార్ ఎన్నికల రిజల్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ ప్రాంతం అంటూ మోదీ నిన్నటి రోజున ఒక ప్రకటనతో హింట్ ఇచ్చారు. అటు తమిళనాడులో కూడా పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ పోరును సైతం త్రిముఖంగా మార్చే ప్రణాళికలో భాగంగా ప్లాన్ వేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తూ ఉంటే నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కూడా తమ హవా కొనసాగించాలనే విధంగా పక్క ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏ ఏ రాష్ట్రాలలో ఎన్డీఏ హవా కనిపిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: