బీఆర్ఎస్ పార్టీకి వరుస ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. పార్టీ పేరు మార్చిన నాటి నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్న బీఆర్ఎస్ 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ఉపఎన్నికల పరంపరలో భాగంగా జరిగిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కోల్పోవడం గమనార్హం.
ఈ పరాజయాలకు వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన షాకింగ్ ఫలితాలు మరింత బలాన్ని చేకూర్చాయి. దీనికి భిన్నంగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే పార్టీకి అనుకూల ఫలితాలు రావడం ఒక ఊరటగా నిలిచింది.
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సానుభూతితో మాగంటి సునీతను గెలిపిస్తారని అందరూ భావించినా, అక్కడ కూడా బీఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బీఆర్ఎస్ పార్టీ అతి విశ్వాసంతో వ్యవహరించడమే ఈ ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే, ఓటమి తర్వాత మాగంటి సునీత మాత్రం తాను నైతికంగా విజయం సాధించానని చెప్పుకొచ్చారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో సైతం తనను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుస ఓటముల పరంపర నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ఇవన్నీ మరింత టెన్షన్ పెడుతున్నాయి. కేసీఆర్ జోక్యం చేసుకుంటే మాత్రమే పార్టీ పరిస్థితి మారుతుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి