కాంగ్రెస్ కు బీహార్ పైన అత్యధిక ఆశలు ఉండేవి. కానీ చివరికి బీహార్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ దారుణంగా ఓటమిపాలైంది. ఇంతకుముందు కంటే చాలా తక్కువ సీట్లు వచ్చాయి. అసలు మెజారిటీ సాధిస్తుందన్న స్థానాల్లోనే దారుణంగా ఓటమిపాలైంది. మరి దీనికి కారణం ఏంటనేది సమీక్ష చేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి బిజెపి విజయం సాధించింది.  ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ కూటమి, ఎన్డీఏ కుటమి మధ్య హోరాహోరీ జరిగినటువంటి పోటీ మధ్య ఎన్డీఏ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరి కాంగ్రెస్ కూటమి ఇంతగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి  అనే వివరాలు చూద్దాం.. దశాబ్ద కాలం నుంచి బీహార్ ప్రజలు ఎంతో ప్రేమిస్తున్నటువంటి తేజస్వి యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురయింది. ఇక ఎన్నికల్లో ఓటమిపాలవ్వడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై  సందిగ్ధం ఏర్పడింది..

 2015లో నితీష్ తో కలిసి పోటీ చేసి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత నితీష్ తో విడిపోయారు. దీంతో నితీష్ బీజేపీతో జట్టు కట్టారు. అప్పటినుంచి తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా బీహార్లో  కులాల ప్రతిపాదికనే ఓట్లు వేస్తారు. ఆర్జేడి సాంప్రదాయక ఓటర్లైనటువంటి యాదవ ముస్లింల కాంబినేషన్ చాలా కలిసి వచ్చింది. ఇక వీళ్లే కాకుండా ఎంబీసీలు కూడా నితీష్ తోనే ఉన్నారు. అంతే కాదు ఈయన ప్రభుత్వ హయాంలో  మహిళలకు పెద్దపీటవేసి మహిళా రోజ్ గర్ యువజన పథకం కింద ఇరవై ఒక్క లక్ష మంది మహిళలకు పదివేల రూపాయలు ఖాతాలో జమ చేశారు. బిజినెస్ లు చేసుకోవడానికి రెండు లక్షల రూపాయల రుణాలు కూడా ఇప్పించారు. దీంతో మెజారిటీ మహిళలు  ఎన్డీఏకు ఓటు వేశారు. ఇక ఇవే కాకుండా కాంగ్రెస్ కూటమి ఓటమికి మరో విషయం కారణమని ఒక వార్త బయటకు వచ్చింది.

 ఇంతకీ అది ఏంటయ్యా అంటే జంగిల్ రాజ్.. ఈ మాట విన్నప్పుడల్లా బీహార్ జనాల్లో వెన్నులో వణుకు పుడుతుందట. 1990 నుంచి 2005 వరకు ఈమధ్య కొంత కాలం మినహా చాలా సంవత్సరాలు లాలూ యాదవ్ కుటుంబమే బీహార్ ని పాలించింది. ఈ టైంలోనే జరిగినటువంటి కులాల సంకుల సమరంలో 566 మంది మృతి చెందారు. అంతేకాకుండా తుపాకులు, బాంబులు ప్రభుత్వానికి సమాంతరంగా రౌడీల రాజ్యం ఏలింది. లాలూ ఫ్యామిలీ అంటేనే సామాన్యులు వణికిపోయారు. దీంతో ఈయనను జంగిల్ రాజ్ అంటూ ఒక ముద్ర కూడా వేశారు.. ఇక ఈ ఎన్నికల్లో కూడా జంగిల్ రాజ్ అనే మాట బయటకు రావడంతో లాలూ కుటుంబం పూర్తిగా అధికారానికి దూరమైందని రాజకీయ విశ్లేషణలు అంటున్నారు. ఇదే కాకుండా తేజస్వి యాదవ్ పై  11 క్రిమినల్ కేసులు ఉండడం, ఇలా అన్ని రకాలుగా ఆయనకి మైనస్ గా ఉండడంతో బీహార్ లో దారుణంగా ఓటమిపాలయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: