జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.. దాదాపు మూడుసార్లు చతికిల పడ్డ ఆయన ఈసారి విజయ బావుటా ఎగరవేశారు. తన కల జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం సాకారం చేసుకున్నాడు. యువ నాయకుడిగా ఉన్న నవీన్ యాదవ్ ఈ జూబ్లీహిల్స్ ను ఏ విధంగా డెవలప్ చేస్తారు..తన స్థానాన్ని ఫ్యూచర్ లో ఏ విధంగా కాపాడుకుంటారు అనేది నవీన్ యాదవ్ పైనే ఆధారపడి ఉంది.. ఇప్పటివరకు నవీన్ యాదవ్  మాగంటి గోపీనాథ్ పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దురదృష్టవశాత్తు గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక రావడం నవీన్ యాదవ్ కు కలిసి వచ్చింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఈ ఎన్నికల్లో  ఆయన దాదాపు 25వేల మెజారిటీ సాధించారు.

 కానీ ఇదే తరుణంలో నవీన్ యాదవ్ ను ఆ ఒక్క సెంటిమెంట్ భయపెడుతుందట.. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ  అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తూ వస్తున్నారు. కానీ తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్ లో మాత్రం ఓటమి పాలవుతున్నారు. 2016 నుంచి 2025 వరకు జరిగినటువంటి ఉప ఎన్నికలన్నింటిలో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. అభ్యర్థులు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే మాత్రం ఓటమి పాలవుతూ వస్తున్నారు.

అయితే ఇదే సెంటిమెంట్ నవీన్ యాదవ్ కి కూడా వర్తిస్తే మాత్రం , మళ్లీ వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఆయనకు ఓటమి వస్తుందా అంటూ కొంతమంది భయపడిపోతున్నారు.. నిజానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో నవీన్ యాదవ్ ఒక యువ నాయకుడు. ఇన్నాళ్లు ఆయనకు గట్టి పోటీ ఉండేది. కానీ గోపీనాథ్ మరణంతో ఆయనకు పోటీ లేకుండా పోయిందని చెప్పవచ్చు. ఇదే స్థానంలో ఆయన మంచి అభివృద్ధి చేసి ప్రజల మనసులు గెలిస్తే మాత్రం జూబ్లీహిల్స్ వదిలిపెట్టి పోయే పరిస్థితి ఏర్పడదు. ఒకవేళ సెంటిమెంటు ప్రకారం  జరిగితే మాత్రం తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో నవీన్  యాదవ్ కు పరాభవం తప్పదంటూ  కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: