తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే ఓటమికి తాను రీజన్ కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజం అని కవిత అన్నారు. హరీష్ రావు గురించి గట్టిగా మాట్లాడితే నన్ను బయటకు పంపారని ఆమె కామెంట్లు చేశారు. కేటీఆర్, హరీష్ రావు పేరుకు కృష్ణార్జునులు అని ట్వీట్ చేసుకోవడం మినహా క్షేత్రస్థాయిలో పని చేయడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
15 మంది ఇండిపెండెంట్లు మేము ఉపసంహరించుకుంటున్నామని ఎవరికి మద్దతు ఇవ్వాలని అడిగారని నాకు జూబ్లీహిల్స్ ఎన్నిక సంబంధం లేదని నేను చెప్పానని ఆమె కామెంట్లు చేశారు. తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరికి వెళ్లారని ఆయన కూడా అదే సమాధానం చెప్పారని కవిత చెప్పుకొచ్చారు. మీ ఇష్టం ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అని ఆయన అన్నారని కవిత కామెంట్లు చేశారు.
నేను బీఆర్ఎస్ పార్టీలో లేను కాబట్టి బైపోల్ కు దూరంగా ఉన్నానని కానీ హరీష్ రావు పార్టీలో ఉంటూనే మోసం చేశారని ఆమె కామెంట్లు చేశారు. గ్రూప్1 జాబ్స్ విషయంలో తెలంగాణ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందని ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని కవిత అన్నారు. హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎంకు సంబంధాలు ఉన్నాయని కవిత అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందని అందుకే పార్టీ ఓడిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు ఆస్తులు పెంచుకున్నారు కానీ కేడర్ ను పెంచుకోలేదని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారని కవిత ప్రశ్నించారు. కవిత సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి