ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో, ఎక్కడ నాయకులు ప్రజలతో మమేకం కాలేకపోయారో… ఆ ప్రాంతాల్లో స్వయంగా జగన్ రంగంలోకి దిగుతున్నారు. గ్రామాలు, పట్టణాలు ఏవి వచ్చినా… అక్కడ జగన్ పర్యటన అంటే ప్రజలు తండోపతండాలుగా రోడ్డెక్కి ఆయనను చూసేందుకు చేరిపోతున్నారు. చేతులు ఊపుతూ, దగ్గరకు చేరి మాట్లాడేందుకు ఎగబడి పడిపోతున్నారు. ఫోటోలు దిగేందుకు యువత పోటీపడుతోంది. ఇలా జగన్ ను చూడటానికి వస్తున్న జనసంద్రాన్ని చూసి కొందరు “జగన్‌కి నిజంగానే ఇంత పాపులారిటీ ఉందా?” అని ఆశ్చర్యపోతుండగా, మరికొందరు “వైఎస్సార్‌సీపీ డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకురావడమే ఇదంతా” అంటూ అనుమానిస్తున్నారు.అయితే రాజకీయ విశ్లేషకుల మాట ప్రకారం ఈ జనసంద్రం కేవలం డబ్బులతో రాదని, జగన్‌పై ప్రజలకు ఇంకా ఉన్న ప్రేమే దీనికి కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రజలతో మాట్లాడే తీరు, వారి సమస్యలను నేరుగా వినటం, కళ్లలోకి చూస్తూ స్పందించడం… ఇవన్నీ ప్రజల మనసుల్లో ఇప్పటికీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
అయితే ప్రజలు ఇప్పుడు మాట్లాడుతున్న అసలు పాయింట్ మాత్రం వేరే. జగన్ ప్రజల మధ్యకి రావడం మాత్రమే సరిపోదు. ప్రభుత్వం పనిచేసిన విధానంలో ఎక్కడ లోపాలున్నాయో, ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో, ఎవరెవరు అధికారంలో ఉన్నప్పుడు తమ బాధ్యతలు విస్మరించారో… అవన్నీ జగన్ నేరుగా ప్రజల నుండి తెలుసుకోవాలి. మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజలకు నిజమైన సమస్యల పరిష్కార మార్గాలు చూపించాలి.
రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం —“జగన్ ఒక పని చేస్తే చాలు… అంటే అధికార పార్టీ (ఇప్పుడు ఉన్న ప్రభుత్వం) లోపాలు, వైఫల్యాలను నిప్పుల చెరిగేలా ప్రజలకు చెప్పగలిగితే, ప్రభుత్వం సచ్చినట్టు దిగి రావాల్సిందే” అంటే ప్రభుత్వంపై నేరుగా ప్రజల్లో నిరసన పెరిగేలా, వాస్తవాల ఆధారంగా గట్టిగా ఎత్తిచూపితే – రాజకీయ పరిస్థితి ఒక్క రాత్రిలోనే మార్చేయగల శక్తి జగన్‌కి ఉందని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో, వివిధ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ ఎక్కువగా నడుస్తోంది. జగన్ తన పాత తప్పులను అంగీకరించి, కొత్త స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారని, ఆయన ప్రతి పర్యటన ఇప్పుడు రాజకీయంగా బలమైన మెసేజ్ ఇస్తోందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు.
ఏదేమైనా…జగన్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు, ప్రజలతో మమేకం కావడంపై పెట్టిన స్పెషల్ ఫోకస్, బలహీన ప్రాంతాల్లో కదిలే ధోరణి — ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో భారీ మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయి. జగన్ ఆ ఒక్క పని — ప్రభుత్వం లోపాలను బహిర్గతం చేసి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగు వేస్తే… ప్రస్తుత ప్రభుత్వం నిజంగానే సచ్చినట్లు పడిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి