జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  ఎప్పుడైతే ముగిసిందో అప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఉప ఎన్నికల గురించి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ ఉప ఎన్నిక ఎక్కడయ్యా అంటే ఒకటి స్టేషన్గన్పూర్, మరొకటి ఖైరతాబాద్.. స్టేషన్గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కడియం శ్రీహరి పార్టీ మారి కాంగ్రెస్లో చేరారు.. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ . ఇద్దరూ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లారని ప్రజలను మోసం చేశారంటూ ఇప్పటికే కోర్టులలో కేసు వేశారు. దీనిపై ఆ ఎమ్మెల్యేలు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి లేదంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇదిలా నడుస్తున్న సమయంలో కడియం శ్రీహరి ఒక సవాల్ విసిరినట్టు తెలుస్తోంది. ఆయన తప్పనిసరిగా ఉపఎన్నికకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతుంది. మరి ఆయన ఏమన్నారో ఆ వివరాలు చూద్దాం.. 

తాజాగా కడియం శ్రీహరి ఒక సవాల్ విసిరినట్టు తెలుస్తోంది. నేను రాజీనామా చేయడానికి సిద్ధం.. రాజ్యాంగం ప్రకారం మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారు. నాకు కొన్ని సిద్ధాంతాలు కట్టుబాట్లు ఉన్నాయి ప్రజలు నన్ను నమ్ముతారని గట్టిగా చెబుతున్నారు. ఈ దమ్ము కేవలం కడియం శ్రీహరికి కాకుండా దానం నాగేందర్ కి కూడా కావాలి.  ఇద్దరిపై అనర్హతా వేటు పడకముందే రాజీనామా చేయాలి. కానీ ఇందులో కడియం శ్రీహరి మాత్రం తప్పకుండా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టు మాట్లాడుతున్నారు. అనర్హత వేటు పడితే ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయకుండా ఉండాల్సి వస్తుంది. ఇది ముందే గమనించినటువంటి కడియం శ్రీహరి మొదటి నుంచి గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్ చేసుకొని ఒకవేళ అనర్హత వేటు  వేసే సమయం వస్తే ముందుగానే తాను రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ కడియం శ్రీహరి రాజీనామా చేస్తే మాత్రం ఆయనకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రాజయ్య.. కానీ కడియం ఏ మాత్రం భయపడకుండా తప్పకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని ధీమాతో ఉన్నారు. నేను అలాగే మిగతా ఎమ్మెల్యేలు అటు ఆ పార్టీలో ఈ పార్టీలో అని చెప్పకుండా తిరుగుతున్నారు. కాబట్టి వీళ్లు కూడా కడియం శ్రీహరిలాగా దమ్ము ధైర్యంతో ఉండి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో క్లియర్ గా చెప్పాలి. అంతేకాదు ఒకవేళ అనర్హత వేటు వేసే సమయం వస్తే మాత్రం వాళ్లు రాజీనామా చేసి మరీ పోటీ చేసి గెలిచే సత్తా వారిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలని ప్రజలు మేధావులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కడియం శ్రీహరిని మాత్రం ధైర్యవంతుడు అంటూ మెచ్చుకొని కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి కడియం శ్రీహరి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వస్తారా లేదా అనేది కొన్ని రోజుల్లో బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: