32 అంతస్తులలో ఉండే ఈ 7 టవర్స్ లో చెలరేగిన ఈ మంటలు దాటికి 93 మంది మరణించినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. అలాగే 280 మంది ఆచూకీ తెలియలేదని ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా శవాల దిబ్బలుగా మారిపోయాయని తెలియజేశారు. 48 గంటలుగా 304 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న అదుపులోకి రాలేదని తెలుపుతున్నారు. ఇందులో 76 మంది గాయపడ్డారని మరో 15 మంది పరిస్థితి విషయంగానే ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ అగ్ని ప్రమాదంతో 700 మందిని తాత్కాలిక నివాసాలకు తరలించినట్లుగా అధికారులు తెలుపుతున్నారు.
ఈ అగ్ని ప్రమాదానికి కారణమైన ముగ్గురిని పోలీసులు కూడా అరెస్టు చేశారు. ఈ ప్రమాదం పైన పోలీసులు దర్యాప్తు చేయగా.. ముఖ్యంగా కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనాలు ఇంత పెద్ద ఎత్తున మంటలు రావడంతో అసలు ఆ భవన మరమ్మత్తులలో ఉపయోగించిన సామాగ్రిలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ భవనాల నిర్మాణంలో ప్రతి కిటికీలలో కూడా స్టైరో ఫామ్ తో తయారుచేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇది పెట్రోలియం ఆదారిత ప్లాస్టిక్ అన్నట్లుగా తెలుస్తోంది. దానివల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయనే అనుమానాన్ని తెలియజేస్తున్నారు అధికారులు. వీటి పైన ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి