భారతదేశ ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉండాలి అనే ప్రతి పాదనను భారత ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితం తీసుకు వచ్చింది. ఇక భారత ప్రభుత్వం ఆధార్ కార్డు లను ప్రతి ఒక్క భారత పౌరుడికి అందించాలి అని నిశ్చయించుకుంది. అలాగే ప్రతి భారతదేశ పౌరుడికి ఆధార్ కార్డు అందించాలి అనే విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశ వ్యాప్తంగా అనేక సెంటర్లలో ఉచితంగా మొదట దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డులను ఇష్యూ చేసింది. ఇక భారత దేశ ప్రభుత్వం మొదటగా ఇష్యూ చేసిన ఆధార్ కార్డులలో తప్పులు అనేకం దొర్లాయి. దానితో వాటిని సవరణ చేసుకునే వెసులు బాటును కూడా భారత ప్రజలకు ప్రభుత్వం కల్పించింది. అలాగే కొన్ని సేవలను మొబైల్ ఫోన్ ద్వారా కూడా పొందే వెసులు బాటును ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఆధార్ కార్డు అనేది చాలా ప్రభుత్వ సేవలు పొందడానికి వీలుగా దానిని వాటికి లింక్ చేశారు. దానితో అనేక సేవలను , ప్రయోజనాలను భారత దేశంలో పొందడానికి ఆధార్ కార్డు ఎంతో ముఖ్య మైనదిగా మారింది.

 ఇలా ఆధార్ కార్డు అనేది ప్రతి భారత పౌరుడికి ముఖ్యం అని , భారతదేశ పౌరుడు అయి ఉండి అతని కి ఆధార్ కార్డు కనుక లేనట్లయితే అతనికి అనేక ప్రయోజనాలు కూడా అందవు అనే స్థాయి కి ఆధార్ కార్డు ప్రాముఖ్యతను తీసుకు వచ్చారు. ఇకపోతే తాజాగా ఆధార్ కార్డు ఉపయోగాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  తాజా గా సుప్రీం కోర్టు ఆధార్ తో ఓటు హక్కు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దేశం లో అనేక నకిలీ ఆధార్ కార్డులు ఉన్నాయి. భారత పౌరసత్వానికి ఆధార్ కార్డు ప్రముఖమైనది కాదు అని తేల్చి చెప్పింది. ఆధార్ కార్డు కేవలం ఒక గుర్తింపు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలి.  ఆధార్ కార్డు ఉన్నా ఓటు హక్కును ఇవ్వడానికి వీలు లేదు. ఓటు హక్కు అనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయం అని , తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: