ఇక ఆ మాట సభలో చప్పట్లు కొట్టించినా, వెంటనే అది విమర్శల జడివానను కురిపించింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏకమై ఆయనపై భారీ దాడికి దిగాయి. బీఆర్ఎస్ కౌంటర్: "మెదడు వాడని డిప్యూటీ సీఎం..ఈ వివాదంపై బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి అత్యంత ఘాటైన కౌంటర్ ఇచ్చారు. "ఆంధ్రా వారే హైదరాబాద్‌కి వస్తున్నారు కదా, తెలంగాణ దిష్టి గోదావరి వాళ్లకు ఎందుకు తగులుతుంది? ఎన్ని ఏళ్లుగా వాళ్ల దిష్టి మా తెలంగాణకు తగిలింది?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా, ఉప ముఖ్యమంత్రి పదవిని పరోక్షంగా ప్రస్తావిస్తూ... "మెదడు వాడకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్లు కూడా డిప్యూటీ సీఎంలు అవుతున్నారు" అంటూ ఘాటు సెటైర్లు విసిరారు.
పవన్ పనితీరును, ఆయన విధానాలను బీఆర్ఎస్ గట్టిగా టార్గెట్ చేసిందని స్పష్టమైంది.కాంగ్రెస్ అస్త్రం: ఒంటరి పోరాట బలహీనత .. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అవకాశాన్ని వాడుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏకంగా పవన్ కల్యాణ్ "ఒంటరిగా పోటీ చేసి గెలవలేరు" అంటూ వైసీపీ గతంలో చేసిన విమర్శలనే పునరావృతం చేశారు. 2024 ఎన్నికల్లో ఆయన పొత్తులతోనే గెలిచారు తప్ప, సొంత బలం కాదని ప్రత్యర్థులు గట్టిగా సటైర్లు వేస్తున్నారు. ఏపీలో వైసీపీ, ఇక్కడ కాంగ్రెస్-బీఆర్ఎస్.. ఇలా ఏ పార్టీ అయినా పొత్తుల రాజకీయ పంథానే పవన్ కల్యాణ్ అసలు సిసలు బలహీనతగా చూస్తుండటం గమనార్హం. ఆయన ఎంత పెద్ద విజయం సాధించినా, ఈ లోటును పదేపదే ప్రత్యర్థులు ఎత్తిచూపడం తప్పడం లేదు. ఈ తీవ్ర విమర్శలపై జనసేనాని ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి