ఇప్పటికే మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమము చేపట్టి ఆ ఉద్యమాల ద్వారా ప్రజలకు అసలు విషయాలను తెలియజేయడంతో పాటుగా ఇటీవలే ర్యాలీలు కూడా చేపట్టారు. అలాగే ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను గవర్నర్ కి అందచేయడం జరుగుతుంది. ఇటీవలే పార్లమెంట్లో జరిగిన సభలలో కూడా ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన కూడా తెలియజేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటికరణం చేయకూడదని కోరారు. వీటన్నిటి తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకుంటే, ఆమరణ నిరాహార దీక్ష లేదా రిలే దీక్ష మొదలుపెట్టే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొదట దశలో రిలే దీక్ష చేస్తారని ఆ తర్వాత ఆమర నిరాహారన దీక్ష మొదలుపెట్టబోతున్నట్లుగా వినిపిస్తోంది. ఈ విషయం పైన వైసీపీలో ఉండే సీనియర్ నేతలతో చర్చించినట్లుగా వినిపిస్తోంది. అయితే ఈ విషయం ప్రభుత్వనికి కొంతమేరకు లిక్ కావడంతో కొంత డైలమాలో పడేసేలా చేసింది. ఈ మధ్య తరచూ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పైన కూడా జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటికరణ విషయంపై నిరాహారదీక్ష మొదలు పెట్టబోతున్నారనే విషయం వైసిపి కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చిన, కూటమి ప్రభుత్వానికి పెద్ద చిక్కు తెచ్చేలా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి వైసిపి నేతలకు దీటుగా కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి