ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అమరావతి రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక విధంగా అమరావతి పేరు హైలెట్ అయ్యేలా చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని విషయాలలో కూడా అమరావతికి అనుకూలంగా ఉండేలా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా అమరావతి రాజధాని దేశానికే రోల్ మోడల్గా కనిపించేలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నో ప్రముఖ కంపెనీలను అమరావతికి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తాజాగా క్రికెట్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది.


ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకరు. ఈనెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి రాబోతున్నారు. ప్రపంచ క్రికెట్లోనే ఒక కూల్ కెప్టెన్ గా పేరు సంపాదించిన ధోనితో , ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటుగా క్రీడా శాఖ మంత్రి కూడా భేటి అయ్యేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి యువత ప్రతిభను సైతం వెలికితీయడానికి క్రికెట్ అకాడమీ కూడా ఏర్పాటు చేయించే విషయం పైన చర్చించబోతున్నట్లు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


అంతర్జాతీయ స్థాయిలో అనుభవం పేరు కలిగిన ధోని మార్గదర్శకత్వం లోనే ఏపీలో ఆధునిక క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనివల్ల యువ క్రికెటర్లకు కూడా మరిన్ని అవకాశాలు లభిస్తాయని పలువురు నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. 2014లో అమరావతిలో ఒక క్రికెట్ స్టేడియంని నిర్మించిన చంద్రబాబు ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మరొకసారి 2024 లో అధికారం చేపట్టిన తర్వాత ఆ స్టేడియానికి మరమ్మత్తులు నిర్వహించారు.భేటీ అనంతరం ఆ స్టేడియాన్ని ధోని సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీకి ధోని వస్తున్నాడనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: