ఏపీ ప్రభుత్వం తాజాగా చేనేత, పవర్ లూమ్ కార్మికులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చి దిశగా అడుగులు వేసింది. ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రాబోతోందని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము చేనేత కార్మికులకు అండగా ఉంటామని మాట ఇచ్చాము ఆ మాట ప్రకారమే ఇప్పుడు నెరవేర్చామని తెలిపారు.


ఎన్టీఆర్ (టిడిపి )కాలం నుంచే చేనేతలకు తోడుగా ఉన్నాము. ఇచ్చిన మాట ప్రకారమే హ్యాండ్ లూమ్ (మగ్గం) వారికి 200 యూనిట్లు, పవర్లూమ్ (మర మగ్గం) వారికి 500 యూనిట్లను ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. ఈ పథకం వల్ల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1,03,534 చేనేత కుటుంబాలకి లబ్ధి పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  హ్యాండ్ లూమ్ 93,000 కుటుంబాలు ,పవర్ లూమ్  10,534  కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ లబ్ధిచేకూరానుంది.దీంతో ప్రతి నెల కూడా రూ .85 కోట్ల రూపాయలు భారం ప్రభుత్వం పైన పడుతుందని మంత్రి సవిత తెలిపారు.


ఈ స్కీమ్స్ వల్ల మగ్గం లబ్ధిదారులకు ప్రతినెల రూ. 720 రూపాయలు అదా ఆవుతుంది, ఏడాదికి రూ .8,000 లకు పైగా ఆదా అవుతుందని, మరమగ్గం లబ్ధిదారులకు నెలకు రూ .1800 అదా కాగా, ఏడాదికి రూ. 21,600 రూపాయలు ఆదా అవుతుందని తెలియజేశారు. అలాగే 50 ఏళ్ల వయసు నుంచే చేనేతలకు రూ.4000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నామంటూ మంత్రి సవిత తెలిపారు. ఇందులో 87,280 మంది ఈ పెన్షన్ పొందుతున్నారని.. ఈ పెన్షన్ ని రూ .3000 వేల నుంచి 4000 రూపాయలకు పెంచడంతో ఏడాదికి 12,000 అదనంగా లభిస్తుందని తెలిపారు. ఇలా చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసమే ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూందని తెలిపారు మంత్రి సవిత.

మరింత సమాచారం తెలుసుకోండి: