తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరినప్పటినుండి ఎన్నో ఊహగానాలు పార్టీ పై వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని, మంత్రి పదవి ఇస్తానని ఆశతో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అసహనంతో పార్టీ పై తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్నాయి. తాజాగా బండి సంజయ్ పాత బస్తీ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ని దర్శించుకొని ఆ తర్వాత జరిగిన సభ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు అసహనంగా ఉన్నారు. అంతేకాదు  సోమవారం రోజు 8 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక దగ్గర భేటీ అయ్యి మంత్రులు వాళ్ళు తీసుకునే కమిషన్లు,కలెక్షన్లపై రాహుల్ గాంధీకి లేఖ రాశారు ఇది నిజం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వడం లేదని చాలామంది ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కాదు కాంగ్రెస్ లో ఉన్న వాళ్లే ఆ పార్టీని నిలువునా కూల్చేస్తారు.

 ఇక బీఆర్ఎస్ ఎప్పుడో మునిగిపోయిన నావా.. ఇక బీఆర్ఎస్ పార్టీ ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. అంటూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పై సెటైర్లు వేస్తూ మాట్లాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్.అలాగే మేము అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కరీంనగర్లో బిజెపి గెలవడం ఒక చరిత్ర అంటూ చెప్పుకొచ్చారు. అలాగే హైదరాబాద్లో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి బిజెపి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: