వైకాపానే ప్రధానంగా టార్గెట్ ను చేసేందుకు టిఆర్ఎస్ వ్యూహం పన్నింది. సీమాంధ్రలో మంచిపట్టున్నటువంటి వైకాపా క్రమంగా తెలంగాణలో పట్టుసాధిండం కోసం నడుముబిగించింది. ఇందులో భాగంగానే వైకాపా నాయకురాలు దివంగత వైఎస్ఆర్ కుమార్తే షర్మిల తెలంగాణ ప్రాంతంలో మరోప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర తలపెట్టడంతో పాటు,వివిధ పార్టీల నాయకులను వైకాపా వైపు తిప్పుకుంటుంది. కాగా చేరికల సందర్బంగా వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా పాల్గొంటున్నారు. తెలంగాణలో అడుగిడినటువంటి వైకాపాలో చేరడం కోసం టిఆర్ఎస్ బాధితులతో పాటు వివిధ పార్టీల నాయకులు ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది ఇప్పటికే చేరిపోయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో తమకు ప్రమాదముందని గ్రహించినటువంటి టిఆర్ఎస్ వైకాపాలో చేరినటువంటి, చేరడంకోసం సిద్దంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బహిరంగసభలను ఏర్పాటు చేసి వైకాపాలో చేరేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారి మనసు మళ్లించాలని ప్రయత్నం చేస్తుంది. మొదటి శత్రువు వైకాపాను ఎలా దెబ్బతీయాలనే ప్రయత్నం చేసుకుంటునే రెండవ శత్రువుగా ఉన్నటువంటి టిడిపిని టార్గెట్ చేస్తుంది టిఆర్ఎస్. ఇందులో భాగంగానే రాజన్న, చంద్రన్న అంటూ వారి పేర్లు పదేపదే గుర్తు చేస్తున్నారు. కెసిఆర్ ప్రసంగంతో పాటు తన అనుచరుల ప్రసంగంలో కూడా ఎక్కువశాతం వైకాపా, టిడిపిలపై విమర్శలకే ప్రాధాన్యనిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కథ తెలంగాణలో అయిపోయిందనుకున్నారో, తమకు కాంగ్రెస్ పార్టీ అంతగా టార్గెట్ కాదనుకున్నారో,  వీటన్నింటికి మించి కాంగ్రెస్ పార్టీపై కెసిఆర్ కు నమ్మకం ఉందో తెలియదుగాని కాంగ్రెస్ పార్టీని అంతగా టార్గెట్ చేయడం లేదు. దీంతో పాటు వరంగల్ జిల్లాలో వైకాపాలో కొనసాగుతున్న కొండదంపతులను రాజకీయంగా దెబ్బతీయడం కోసం కెసిఆర్ కుటుంబం నేరుగానే రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే కెసిఆర్, కెటిఆర్ లు కొండదంపతులను వదిలిపెట్టకుండా విమర్శిస్తున్నారు. కాగా ఇప్పటివరకు టిఆర్ఎస్ అంటే కొంత సెంటిమెంట్ ఉందికాదా అనే భయంతో ఉండి వెనుక్కితగ్గిన వివిధ పార్టీల నాయకులు వరంగల్ సంఘటనలతో ఎదురుదాడులకు సిద్దమైనట్లు తెలుస్తుంది. టిడిపి, వైకాపాలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీని కూడా ఆరెండు పార్టీల నాయకులు ప్రధాన టార్గెట్ గా ఎంచుకున్నాయి. ఇటువంటి సందర్బంలో నాయకులు వ్యక్తిగత విమర్శలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: