రెండు కోట్ల సంతకాలు సేకరిస్తే దొంగ దొరై పోతాడా? అని వైసీపీ అధినేత విజయలక్ష్మిని మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ అవినీతి పరుడో కాదో బైబుల్ పై ప్రమాణం చేసి ఆమె చెప్పాలని కోరారు. రెండు కోట్ల సంతకాలు మంది జగన్ను విడుదల చెయ్యాలని సంతకాలు చేస్తే మరి మిగిలిన ఆరున్నర కోట్ల మంది నిన్ను జగన్ మోహన్ రెడ్డి ని దోషిగా తేల్చారా అని ప్రశ్నించారు. కాలి ముద్రలు, వేలి ముద్రలు, కుడి, ఎడమ చేతులతో సంతకాలు చేస్తే ఎన్ని కోట్లయినా సేకరించవచ్చని ఎద్దేవా చేశారు. జగన్ పై మొసలి కన్నీరు కారుస్తున్న విజయలక్ష్మి తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్న ఆమె, సోనియాగాంధీని ఎందుకు విమర్శించటం లేదని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: