నాడు మోటకొట్టి, నిన్నఇంజన్ పెట్టి, కరంటుకోతతో కుమిలిపోతిని నేడు, రైతు బతుకు నాది పాడుగాను అన్నాడు రైతు కుటుంబంలో పుట్టి బాధలనుభవించిన కవి.. కాగా దీంతో పాటు ఎరువుల కోసం రైతుల ప్రాణాలే పోతున్నాయి. రైతుల బాధలకు వెల కట్టలేని పరిస్థితిలో రైతుల పడే కష్టాల వివరాలలోకి వెళ్తే..... ఆలస్యంగా నైనా వర్షాలు కురియడంతో పంటలను సాగుచేద్దామనుకున్న రైతులు ఎరువుల కోసం షాపుల వద్దకు వెళ్లితే ఎరువుల కొరత ఏర్పడుతుంది. అనేక మంది క్యూలైన్లో బారులు తీరి గంటల తరబడి నిలబడి లైన్లోనే అలసిపోయి పడిపోతున్నారు. ఇటువంటి సమయంలోనే మరో బాధకర సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని రామారెడ్డిలో రైతు ఊశయ్య యూరియా కోసం క్యూలైన్లో నిలబడి కుప్పకూలి పోయి చనిపోయారు. సీజన్ దాటిన తర్వాత విత్తనం నాటిన దిగుబడిరాదని, సీజన్ ప్రకారం రైతులు విత్తనాలు వేయడం కోసం ముందుకురాగా ఇటువంటి పరిస్థితిలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు ఎరువుల కోసం బారులు తీరి అలసిపోయి చివరకు వెనుతిరుగుతుండడం, మరికొంత మంది రైతులు క్యూలైన్లో కుప్పకూలడం జరుగుతుంది. ఇంత జరుగుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. కనీసం రైతులకు ఎరువులను ఇప్పించే దిశగా కూడా పాలకులు చర్యలు తీసుకోవడం లేదంటే రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏవిధంగా తెలుస్తుంది. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పాలకులు రైతులు క్యూలైన్లో నిలబడి అలసిపోయి కుప్పకూలి ప్రాణాలు పోయిన తర్వాత కుటుంబానికి ఆపధ్భాందువు పథకాలు, ఆర్థిక సహాయాలు అందించే బదులు రైతులకు ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: