న్యాయవ్యవస్థ.. కార్యనిర్వాహక వ్యవస్థ.. పాలన వ్యవస్థ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూడు మూల స్తంబాలు. నాలుగో స్తంబం మీడియా. పాలన, కార్యనిర్వాహక వ్యవవస్థలపై అవినీతి ఆరోపణలు సర్వసాధారణం. మీడియాపై అరుదు. న్యాయవ్యవస్థపై అత్యంత అరుదు. కానీ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా న్యాయ వ్యవస్థకు సైతం అవినీతి మరకలు అంటుతున్నాయి. కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీబీఐ మాజీ జడ్జీ పట్టాభి రామారావు వ్యవహారంతో న్యాయ వ్యవస్థలో అవినీతి మరోసారి తెరపైకి వచ్చింది.
కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమీషన్ ఛైర్మెన్ గా వ్యవహరిస్తున్నకేజీ బాలకృష్ణన్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విధితమే. బాలకృష్ణన్ భారీ స్థాయిలో సంపదను కూడగట్టారని, వాటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీర్ కృష్ణయ్యర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ఈ అంశం కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉంది.
మరో ఘటనలో ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో జరిగిన ఓ ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణంలో కొందరు న్యాయమూర్తులకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఘజియాబాద్ న్యాయస్థానంలో 3, 4, తరగతులు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మొత్తాల నుంచి ఆరున్నర కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేసినట్లు ఆరుగురు మాజీ జడ్జీలపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 47 మంది మాజీ న్యాయమూర్తులను సీబీఐ కోర్టు విచారించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఇక గాలిజనార్దన్ రెడ్డి ‘బెయిల్ ఫర్ సేల్’ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తున్న ఏ నలుగురు కలిసిన దీనిపైనే చర్చిస్తుండటం విశేషం. ఒక్క గాలిజనార్దన్ రెడ్డి బెయిలు కోసమే రూ.100 కోట్లకు వరకు బేరాసారాలు కుదరడం అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఒక వేళ విషయం వెలుగులోకి రాకున్న గాలికి బెయిలు వచ్చి...అనంతరం పైకోర్టులు బెయిల్ ను తిరస్కరించిన ఆశ్చర్యపోనక్కర లేదు. ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని బెయిల్ కోసమే కోట్లాది రూపాయలు చేతులు మారడంపై యావత్ భారతదేశం ముక్కున వేలేసుకుంది. ప్రస్తుతం ఈ స్కాంలో ఉన్న జడ్జీలు, మాజీ జడ్జీలు బెయిలు కోసం కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: