విధ్యుత్ చార్జీలు పెంచడం, విధ్యుత్ కోతకు నిరసనగా బుదవారం నాడు 10 వామపక్షాల పార్టీలు చలో సచివాలయం ముట్టడికి సిద్దమయ్యాయి. కాగా చలో సచివాలయం కార్యక్రమంలో అపశృతులు దొర్లకుండా ఉండేందుకు గాను పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం నుండే సచివాలయం వైపై వెళ్లే వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో పెరిగిన విధ్యుత్ చార్జీలకు నిరసనగా జరిగిన సఘటనలకు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలో నిమగ్నమైంది. సిపిఎం. సిపిఐ, న్యూడెమక్రసి పార్టీలతో పాటుగా 10 వామపక్షపార్టీలు చలో సచివాలయం కార్యక్రమంలో పాల్గొననున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: