స్థానిక సంస్థల ఎన్నికలు మరో రెండు నెలల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం సూచన ప్రాయంగా ప్రకటించడంతో వైఎస్ఆర్ సిపి స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే దిశగా ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇందుకు గాను గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించింది. దీంతో పాటు జిల్లా ఇంచార్జీలను మార్పు చేసి నేతలను ప్రక్షాళన చేయడం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్నిజిల్లాల ఇంచార్జీలు, కన్వీనర్ల పనితీరుపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండే తెల్సుకుంటున్నట్లు తెలిసింది. కాగా ఆచరణలో పనిచేయకుండా ఆర్బాటం చేసే నాయకులను ఇంచార్జీలుగా తీసివేసి వారి స్థానంలో పార్టీకోసం జోరుగా పనిచేసే పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు లేని చోట అనుభవం కలిగిన మాజీఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను జిల్లా ఇంచార్జీలుగా నియమించే అవకాశాలున్నాయి. జిల్లాల్లోని అన్ని నియోజక వర్గం నాయకులను సమన్వయం పరిచే విధంగా చర్యలు తీనుకుంటుంది. ఇందులో భాగంగానే పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి జైలు నుంచే ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గాలకు అనుగునంగా పార్టీ ఇంచార్జీలను నియమించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే పార్టీలో నాయకుల హోదాలో మార్పులు జరుగడంతో పాటు అన్ని కమిటీలను వేసే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: