హైదరాబాద్: ప్రపంచంలో చంద్రబాబును మించిన మోసగాడు లేడనీ కోలా క్రిష్ణమోహన్ ఆరోపించారు. 1999లో తాను 5కోట్ల 10లక్షల రూపాయలిచ్చానని అంటున్నారు. బాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా 25లక్షల రూపాయలు తీసుకుని, ఓ మహిళతో జంప్ అయ్యాడని కూడా చెబుతున్నారు. తనను మోసగించిన చంద్రబాబుపై అన్ని ఆధారాలతో త్వరలో హైకోర్టులో కేసు వేయనున్నట్లు సంచలన ప్రకటన కూడా చేశారు. తాను ఇచ్చిన మొత్తం డబ్బును తన బ్యాంకు అక్కౌంటు నుంచి సింగపూర్ లోని బాబు అక్కౌంట్లకు బదిలీ చేశాననీ క్రిష్ణమోహన్ శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు. అక్కౌంట్ నెంబర్ సహా మీడియాకు చూపించారు. సింగపూర్లో బాబు మారియట్ హోటల్లో షేరుందన్నారు. అక్కడ లెఖ్కకు లేనన్నీ ఆస్తులున్నాయన్నారు. ఒకప్పుడు బాబు కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్నటు వంటి కోలా ఇప్పుడు బాబు ఇంటి గుట్టునంతటిని విప్పుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన నుంచి తీసుకున్న డబ్బులలో కేవలం 10లక్షలు మాత్రమే ఇచ్చాడన్నారు. మిగత డబ్బులడిగితే పోలీసులతో బెదిరింపచేశాడనీ, 2003లో తనపై హత్యాయత్నం కూడా జరిగిందన్నారు. ఇప్పటికి బాబు నుంచి తన ప్రాణానికి ముప్పు వుందన్నారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగల సమర్థ నాయకుడన్నారు. ఒకానొక సం దర్బంలో ఈడీని కూడా మేనేజ్ చేశాడన్నారు. తనను మోసగించిన చంద్రబాబు గుట్టును బయటపెడతానంటున్నాడు. మొత్తానికి బాబు, ఆయన కుమారుడు తనకు చేసిన మోసాల గురించి కోలా నోరు విప్పడంతో బాబు అసలు రంగు బయటపడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: