మంత్రి ధర్మాన తీసుకున్న రాజీనామా నిర్ణయం ధర్మమేనని అధిష్టానం నిర్ణయించింది. దిగిపోవడానికి సుముఖతను మాత్రమే తెలుపాల్సి ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.                    ఎందరు ఎంత ప్రయత్నించినా చివరకు ధర్మం గెలిచింది. పేరులోని ధర్మాన్ని నిస్సిగ్గుగా వదిలి పదవిలో ఉన్నంతకాలం అధర్మానికే పాల్పడినందుకు చివరకు ఓ చిన్న శిక్ష ఖరారయింది. కాని ఆయన కాలరాసిన ధర్మానికి తగిన ప్రతిఫలం పూర్తిగా ఎప్పుడు దొరుకుతుందనేది సిబిఐ పనితీరు నిర్ణయిస్తుంది.            ఆయనపై కేసు నమోదయింది అవినీతి నిరోదకం కింద, దీనికి ప్రజాస్వామ్య వ్యవస్థలోని పాలనాచట్టానికి ముడిపెట్టి బయటపడాలని తెగ ప్రయత్నం చేసినప్పటికి పప్పులుడకలేదు.మీకే ఇంత తెలిస్తే మేమేనా తెలివిలేని వాల్లం అంటూ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందట. కేంద్రమంత్రి రాజా జైలుపాలు కావడానికి కారణం క్యాబినెట్ నిర్ణయం కాదా..అంటే మమ్మల్నే ఇరికిస్తారా... అన్నట్లు తెలిసింది.            అయినా ధర్మాన చేసింది నిలువు దోపిడి,భూములు కోల్పోయి ఎందరో ప్రాణాలను కూడా తీసుకున్నారాయే వారి ఉసురు ఎటు పోతుంది.అందుకే పదవి ఊడుతూ తొలి శిక్షను అనుభవించడం ఖరారయింది. ఇది మిగిలిన నీతిమాలిన పనులు చేసిన వారిని కలవరానికి గురిచేసింది.అయితే మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన పదవి ఊడగొట్టుకుని విచారణకు సిద్దమవుతుండగా, మిగిలినవారు ముందుగానే పదవులు కోల్పోయి ఆతర్వాత సిబిఐ చేతిలోకి చేరనున్నారట. ఏంజరుగుతుందో ఎదిరిచూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: