హైదరాబాద్: ముందుగా చెప్పినట్లుగానే జనం జగన్ వైపే మొగ్గు చూపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా జగన్ గురించి చెప్పినా ప్రజలు నమ్మలేదు. అవినీతిని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఈ రెండు పార్టీలు ప్రచారం చేశాయి. కానీ, ప్రజలు మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎవరి అంచనాలకు అందకుండా ప్రజలు జగన్కు బ్రహ్మరథం పట్టారు. తామంతా జగన్ వైపే ఉన్నామంటూ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వైకాపాను అందలం ఎక్కించారు. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలలో పదహారును వైకాపా, రెండింటిలో కాంగ్రెస్, ఒకదానిలో టీఆర్ఎస్ పార్టీలు నెల్లూరు పార్లమెంటును వైకాపా కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలువలేకపోయింది. రాష్ర్టంలోని 12జిల్లాలో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు సైకిల్ను పంక్చరు చేశారు. వైకాపా గెలిచిన స్థానాలలో నర్సన్నపేటలో ధర్మాన క్రిష్ణదాస్, పోలవరంలో బాలరాజు, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ శోభానాగిరెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవ రెడ్డి, రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి, రైల్వేకోడూరులో శ్రీనివాస్, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి, అనంతపురంలో గురునాథ్ రెడ్డి, ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, పత్తిపాడులో సుచరిత, మాచర్లలో పిన్నెల్లి రామక్రిష్ణరెడ్డి, పాయకరావుపేటలో బాబురావు గెలుపొందగా, నెల్లూరులో వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలుపొందారు. ఇక నర్సాపురంలో కొత్తపల్లి సుబ్బరాయుడు(కాంగ్రెస్), రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు(కాంగ్రెస్)గెలుపొందగా తెలంగాణలోని పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి గెలుపొందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: