హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట దళితుల ఊచకోతపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాననీ వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బాధితులకు ఆమె ఇచ్చారు. శనివారం నాడు ఆమె లక్ష్మిపేటను సందర్శించారు. బాధితులను పరామర్శించారు. సంఘటను సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామనీ ఆమె భరోసా ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలకు 10లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలనీ, అదే విధంగా ఒక్కో కుటుంబానికి 3ఎకరాల భూమిని ఇవ్వాలనీ డిమాండు చేశారు. అంతే కాకుండా, ఈ సంఘటనకు సంబంధమున్న మాజీ ఎంపీపీ నాయుడుపై కేసు నమోదు చేయాలన్నారు. అనంరం ఆమె విశాఖ స్టీల్ ప్లాంటు బాధితులను కూడా పరామర్శించారు. ఆమె వెంట షర్మిల, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: