హైదరాబాద్: తెలంగాణ సంస్క్రతిని ప్రతి బింబించే బోనాల పండుగ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఉత్సవాలలో పోతరాజుల వేశాలు, న్రుత్యాలు, బోనాలు, డప్పువాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణలో ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ బోనాల పండుగకు లష్కర్ వేదికగా మారున్నది.
గోల్కొండ లోనీ శ్రీజగదాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ బోనాలను ప్రారంభిస్తారు. మరి కొద్దిసేపట్లోనే ఈ వేడుకలను అంగరంగ వైభవంగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బోనాల పండుగ సందర్భంగా గోల్కొండలోని చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబిక ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. తెలంగాణలో నెల రోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని జగదాంబిక అమ్మవారికి రాష్ర్ట ప్రభుత్వం తరుపున సంబంధిత మంత్రులు పట్టు వస్ర్తాలను సమర్పించి వేడుకలను ప్రారంభింపచేస్తారు.
ఇక్కడ బోనాల పండుగ ప్రారంభమైన మరుసటి రోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో బోనాలు ప్రారంభమవుతాయి. పాతబస్తీలోనా జగదాంబిక ఆలయంలో ప్రారంభమై సికింద్రాబాద్లోని మహాంకాళి ఉత్సవాలతో బోనాల పండుగ జోరందుకుంటోంది. హైదరాబాద్లో జరిగే మహాంకాళి ఉత్సవాల్లో రాష్ట్రానికి చెందిన వారే కాకుండా మహారాష్ర్ట, తమిళనాడు, కేరళ, కర్ణాటక, చత్తీస్ ఘడ్, ఒడిషా తదితర రాష్ర్టాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.
తెలంగాణలో నెల రోజుల పాటు జరిగే ఈ బోనాలను పండుగను కులాలకు, మతాలకతీతంగా జరుపుకుంటారు. చిన్నా, పెద్ద, ఆడ, మగా, గరీబ్, ధనవంతులు తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహాంగా పాల్గొంటారు. అందరూ బోనాలు ఎత్తుకుంటారు. నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని దేవాలయాలు దూపదీప నైవేధ్యాలతో కళకళలాడుతుంటాయి. భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాల మధ్యన జరుపుకుంటారు. ఈ నెల రోజులు తెలంగాణలోని ఏ పల్లెలో చూసినా జాతరే, జాతర. బంధువుల రాకతో అందరి ఇళ్లలో సందడే, సందడి.
మరింత సమాచారం తెలుసుకోండి: