హైదరాబాద్: ఇప్పటికే పీకల్లోతు కష్టాలో ఉన్న మెక్ డొవెల్స్, కింగ్ ఫిషర్ అధినేత విజయమాల్య మరోమారు చిక్కుల్లో పడ్డారు.ఏకంగా న్యాయస్థానం ఆయనకు అరెస్టు వారంటును జారీ చేసింది. శంషాబాద్ విమానాశ్రయంలో తన కింగ్ ఫిషర్ విమానాల వినియోగ రుసుంను చెల్లించని కేసులో మెట్రోపాలిటన్ కోర్టు విజయమాల్యతో పాటు మరో ఐదుగురికి నాన్ బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది. జీఎంఆర్ ఫిర్యాదు మేరకు 13వ నగర న్యాయస్థానం విజయమాల్యకు అరెస్టు వారంటును జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో విజయమాల్య కోర్టుకు హాజరుకావల్సింది. కానీ, విజయమాల్యా హాజరుకాని కారణంగా న్యాయస్థానం ఆయనపై ఆగ్రహంవ్యక్తం చేయడంతో పాటు ఈ రోజున విజయమాల్యతో పాటు మరో ఐదుగురికి అరెస్టు వారంటును జారీ చేసింది. విదేశాల్లో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనంటూ విజయమాల్య పిటీషన్ దాఖలు చేసుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: