ఉన్నట్టుండి ఢిల్లీ లో ఓ కొత్త గడబిడ మొదలయింది. సడన్ గా అది చూసిన రాష్ట్రంలో గడబిడ చోటుచేసుకుంది. తెలంగాణ అంశానికి కొంత కాలంగా దూరంగా ఉంటున్న మాజి పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్ కు ఢిల్లీ పిలుపు రావడం, ఢిల్లీ వెల్లిన సిఎం ను వెనక్కు పంపించి డిఎస్, సోనియా సుధీర్ఘంగా చర్చించడం, కేంద్రహోం మంత్రి రాష్ట్రపతిని కలువనుండడం వంటి పరిణామాలు రాష్ట్రంలో ఉత్కంఠను సృష్టించాయి.
ఢిల్లీలో ఇలాంటి గడబిడలు ఇప్పటి వరకు ఎన్నో జరిగినా ఏమి జరగకుండానే తెరపడింది. అయితే ఈసారి ఏదో జరుగుతుంది అన్న సంకేతాలు బలంగా కనిపిస్థున్నాయి. హైదరాబాద్ ప్రధాని పర్యటన ప్రభావం సోనియాపై బలమైన ప్రభావమే చూపిందంటున్నారు. కేసిఆర్ తన పార్టీ శ్రేణులతో దసరా లోపు తెలంగాణపై ప్రకటన వస్తుందని ధీమాగా చెప్పారు. సిఎం వెల్లి మంత్రివర్గాన్ని మార్చుకుంటానంటే సోనియా వద్దంది. సిఎం సోనియాతోనే కాకుండా పలువురు పార్టి ప్రముఖులతో కలిసారు. హోంమంత్రి షిండేను కలసినప్పుడు తెలంగాణ అంశం చర్చకు వచ్చిందన్నారు. ఇలా జరిగిన పరిణామాలు చూస్థుంటే కేంద్రం ఏదో అడుగు వేయబోతోంది అని స్పష్టమవుతోంది.
తెలంగాణపై ప్రకటన చేస్థుందా...అది ఏంటన్నది పక్కన బెడితే పరిస్థితిని చక్కదిద్దాలంటే తప్పదని ప్రధాని పర్యటనతోని రుజువైంది. తెలంగాణలో మున్ముందు కాంగ్రేస్ నాయకులు తిరిగే పరిస్థితులు కనిపించడం లేదన్న సంకేతాలను ప్రధాని పర్యటన స్పష్టం చేసింది. దేశాధినేతనే హైదరాబాద్ లో గడపడం కష్టం అయిందంటే ఇక సాధారణ నేతల విషయం ఆలోచించక్కర్లేదనే అభిప్రాయం అధిష్టానంలో కలిగిందట. నేతలే తిరగలేనప్పుడు ఇక ఓట్ల గూర్చి ఆలోచించక్కర్లేదు.
కేంద్రంలో పరిస్థితులు మద్యంతరం వైపు పయనిస్థున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపి లో సీన్ మారాల్సిందే. అంటే అర్జంట్ గా ఏపి గాయానికి మందు పెట్టాలి. దీని కోసం తెలంగాణపై ప్రకటన చేస్తారా..? లేక తెలంగాణకు చెందిన వారికి సిఎం పీఠం ఇస్తారా..? అందుకే మంత్రివర్గ విస్థరణ వద్దన్నారా..? ఇలా రకరకాల ఊహాగానాలు వెలుబడుతున్నాయి. వీటికి కారణాలు లేకపోలేదు. సిఎం కిరణ్ పై నిరసన గళాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టిఎంపీలయితే ఏకంగా అధిష్టానానికి కాకుండా లోక్ సభ స్పీకర్ కే ఫిర్యాదు చేసారు. మంత్రి డిఎల్ బాహాటంగానే సిఎం ను దూషిస్తున్నారు.
కేంద్రమంత్రి వర్గంలోను మార్పులు తేనున్నారు. దీనిలో తెలంగాణ వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అలా అని ఇవ్వకపోతే వివక్ష చూపారంటూ అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించే ఏపిలో మార్పులకు సోనియా సిద్దమయ్యారని పార్టి వర్గాలు భావిస్థున్నాయి. అంటే దసరా లోపు కొందరికి పండగ సంబరాలు, మరికొందరికి కారపు ఉండలు తప్పవని తెలుస్తోంది. అదేదో తెలియాలంటే కాస్తా ఆగాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: