కష్టమైనా, నష్టమైనా తానే భరిస్తానంటున్నాడు. ఏ శాఖ ఇచ్చిన న్యాయం చేస్తానంటున్నాడు. ఎవరితో తనకు విభేదాలు లేవంటున్నాడు. ఇటువంటి సందర్బంలో చూసేవారికేందోగాని తెగరెచ్చిపోతున్నారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నిర్వహించినటువంటి పెట్రోలియంశాఖను మార్చి ఆయనకు మరో శాఖను ఇచ్చారని, అందుకే జైపాల్ రెడ్డి అలిగాడని, చివరకు తిండి కూడా ముట్టడం లేదని ఒకటేపనిగా కొన్ని చానళ్లు ఎత్తిపొడుపుమాటలతో ప్రసారం చేశాయి. అసలు ఆయన అలిగాడని, ఆగ్రహంతో ఉన్నాడని ఎవరు చెప్పారో గాని కొన్ని గంటలపాటు జైపాల్ రెడ్డిని గందరగోళానికి గురిచేసే విధంగా ప్రసారం చేశాయి. అయితే జైపాల్ రెడ్డి మాత్రం తనకు మంచి శాఖనే కేటాయించారని, తనకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. శాస్త్ర,సాంకేతిక రంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పర్చడంతోపాటు 8వేల మంది శాస్త్ర వేత్తలతో కల్సి పనిచేసే అదృష్టం దక్కిందని జైపాల్ రెడ్డి అంటుంటే కొంతమంది నాయకులు ఎంటో గాని మద్యలో తల దూర్చి ఏవేవో అంటుంటే వారికి ఎందుకింత బాధనో అర్ధం కావడం లేదు. దేశ ప్రగతికి ఉపయోగపడే కీలకమైనటువంటి శాఖను తాను మోయడానికి సిద్దంగా ఉంటే, నీవు మోయలేవు, ఆమూటలో ఏమీ లేదు అని చూసేవాళ్లు అనడం పద్దతిగా లేదనిపిస్తుంది. ఆమూటలో ఏముందో మోసే వారికి తెలిసినప్పుడు నడుమ నీ పెత్తనమెందుకు, నీవు గబారా పడడం ఎందుకు. అంతేకాదు నిజాయతి పరులైనటువంటి నేతలకు ఎప్పుడు అన్యాయం జరుగదని మంత్రి వర్యులే భరోసాతో ఉంటే మనకెందుకులే అని వదిలివేయాలిగాని సంబంధం లేని దాంట్లో దూరి గాయపడడం ఎందుకు. శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ది పర్చడం కోసం, వేలాది కోట్లు వెచ్చించడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో శాస్త్ర,సాంకేతిక రంగాన్ని అభివృద్ది పర్చడం కోసం కృషిచేసే దిశగా మంత్రి జైపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండవచ్చు. ఇటువంటి విషయాలను పట్టించుకోకుండా ప్రాధాన్యతలేని శాఖను కేటాయించారని కొంతమంది మద్యలో దూరి గగ్గోలు పెట్టడం మంచి పద్దతి కాదనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: